ఈ సంక్రాంతి సీజన్ లో పోటీకి నాలుగు పెద్ద సినిమాలు ఉంటే.. అందులో మూడు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అండ్ ‘పేట’, ‘వినయ విధేయ రామ’ రిలీజ్ అయ్యాయి. ‘కథానాయకుడు’ కి మంచి రెస్పాన్స్ రాగా.. ‘పేట’కు యావరేజ్ టాక్ వచ్చింది. ఈ రోజు విడుదలైన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ టాక్ కాస్త తేడా కొట్టినట్లే కనిపిస్తోంది. అయితే బోయపాటి శ్రీను సినిమాలన్నీ ముందు ఇలాంటి టాక్‌తోనే మొదలవుతాయి కాబట్టి.. ఈ సినిమా రిజల్ట్ ఇది అని మాత్రం ఇప్పుడే చెప్పలేం.
ఈ మూడు చిత్రాలే కాకుండా F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చిత్రం శనివారం రిలీజ్ కాబోతోంది. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ లాంటి స్టార్స్ ఉన్నా.. ఎందుకో సరైన క్రేజ్ అయితే రావడం లేదు. సాంగ్స్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు.
F2 కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినా ఇంతవరకు ఆశించిన రీతిలో టిక్కెట్లు అమ్ముడవ్వడం లేదు. హైదరాబాద్ లోని మూసాపేట అనే ఏరియాలో లక్ష్మీకళ థియేటర్లో బుకింగ్స్ ప్రారంభించినప్పటికీ కూడా కనీసం 20% వరకు కూడా టిక్కెట్లు సేల్ అవలేదు. మరి ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ లేక లేదా దీన్ని ముందు రిలీజ్ అయిన పెద్ద సినిమాల ప్రభావమా అనేది తెలియదు. లక్ష్మీకళ ఒక్కటే కాదు F2 థియేటర్స్ అన్ని పరిస్థితి ఇదే. ఇలా అయితే ఓపెనింగ్స్ కూడా కష్టమే అవుతాయి. మరి ఈ సినిమా రేపు ఎటువంటి రిజల్ట్‌ను అందుకుంటుందో చూద్దాం.