Advertisement
Google Ads BL

‘కథానాయకుడు’పై ఇలా స్పందిస్తున్నారు!


 

Advertisement
CJ Advs

మొత్తానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌లోని తొలిపార్ట్‌ ‘కథానాయకుడు’ విడుదలైంది. ఈ చిత్రంలో కొన్ని లోపాలు ఉన్నా ఓవరాల్‌గా నందమూరి అభిమానులకు ఈ మూవీ బాగా నచ్చింది. ముఖ్యంగా ఇందులోని ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడి రూపంలో కనిపించే సీన్‌ అద్భుతంగా పేలింది. ‘మాయాబజార్‌’లో శ్రీకృష్ణుడి పాత్రను కేవీరెడ్డి ఎన్టీఆర్‌ చేత చేయించాలని అనుకోవడం, అందుకు నాగిరెడ్డి-చక్రపాణి అడ్డు చెప్పడం, చివరకు శ్రీకృష్ణుడి గెటప్‌లో ఎన్టీఆర్‌ షూటింగ్‌స్పాట్‌కి వచ్చినప్పుడు నిజంగా కృష్ణుడు ఇలానే ఉంటాడేమో అని నాగిరెడ్డి ఎన్టీఆర్‌కి నమస్కారం చేయడం, యూనిట్‌లోని అందరు కొబ్బరికాయలు కొట్టి, రంగులు చల్లడం.. ఇలా సాగిన ఈ సీన్‌ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. 

ఇలాంటి సీన్స్‌ సినిమాలో మరికొన్ని ఉంటే ప్రేక్షకులు ఉర్రూతలూగేవారు. ఇక ఈ చిత్రం షోని ప్రత్యేకంగా యూనిట్‌ వీక్షించింది. ఈ షోకి విద్యాబాలన్‌ తన భర్తతో కూడా హాజరైంది. ఈ మూవీ చూసిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రం కేవలం అభిమానులకు చెందింది కాదు. పార్టీలు, కులాలు, మతాలన్నింటికీ అతీతమైన చిత్రమని తెలిపాడు. 

ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఫేస్‌బుక్‌ ద్వారా స్పందిస్తూ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు.. అని నిరూపించిన కారణజన్ముడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారు. ఆ మహానుభావుని పాత్రను పోషించిన బాలయ్యబాబుకి హ్యాట్సాఫ్‌. క్రిష్‌, కీరవాణి, విద్యాబాలన్‌ ఇలా చిత్రానికి పనిచేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు అని తెలిపాడు. 

ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘కథానాయకుడు’ ఎంతటి చరిత్ర సృష్టిస్తుందో నేను చెప్పలేను. ఎన్టీఆర్‌ సృష్టించిన చరిత్రను ఎన్టీఆర్‌ రూపంలో బాలయ్య మరో చరిత్ర సృష్టించారు. ఈ చిత్రం ద్వారా నేడు ఆ మహానుభావుని చరిత్రను అద్భుతంగా ఆవిష్కరించారు. ఆ మహానుభావుడిని చూస్తుంటే ఆర్ధ్రతతో కళ్లు చెమ్మగిల్లాయి. ఈ చిత్రం ద్వారా బాలయ్య సరికొత్త చరిత్రను సృష్టించారు. ఈ చిత్రంలో నాకు బాలయ్య కనిపించలేదు. ఎన్టీఆర్‌ని చూస్తున్నట్లే ఉంది. ఎన్టీఆర్‌ని ఎరుగని వారికి ఆయనను చూపించిన ఘనత బాలయ్యకు దక్కుతుంది. బసవతారకం పాత్రను అద్బుతంగా ఆవిష్కరించారని సీనియర్‌ రైటర్‌ పరుచూరిగోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. 

నారా బ్రాహ్మణి మాట్లాడుతూ, నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాన్నగారు అచ్చు తాతయ్యలానే ఉన్నారు. తాతగారు ఎప్పుడు ప్రజాసేవ గురించే ఆలోచించేవారు. కుటుంబంతో చాలా తక్కువ సమయం గడిపేవారు. మా నాయనమ్మ బసవతారకం నేను పుట్టకముందే మరణించారు. ఆమె ఎంతో గొప్ప వ్యక్తి. తాతగారికి సినీ కెరీర్‌లోనే కాకుండా రాజకీయ జీవితంలో కూడా ఎంతో సపోర్ట్‌ చేశారు. ఈ చిత్రం మూవీలా కాకుండా నిజంగా స్టోరీ చూసినట్లు అనిపించింది. నాన్నగారి ప్రొడక్షన్‌లో ఇది మొదటి సినిమా. దీనికి పూర్తి న్యాయం జరిగింది అని చెప్పుకొచ్చింది.

నందమూరి సుహాసిని మాట్లాడుతూ, మా తాతగారి మాకు తెలియని వాస్తవాలను ఈ చిత్రం ద్వారా తెలుసుకున్నాను. నాన్నగారి పాత్రలో కళ్యాణ్‌రామ్‌ అన్నయ్య అద్భుతంగా నటించాడు. క్రిష్‌ దర్శకత్వం అపూర్వం, అమోఘం. ఈ మూవీ రెండో పార్ట్‌ కోసం ఎదురుచూస్తున్నాను, రేపే విడుదలైనా వెంటనే చూసేస్తాను...అని చెప్పుకొచ్చింది. 

దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ, రామారావు గారి గురించి చాలా రీసెర్చ్‌ మెటీరియల్‌ ఉంది. అది గొప్ప కథ, స్క్రీన్‌ప్లే అద్భుతంగా వచ్చింది. అభినందిస్తూ వస్తున్న కాల్స్‌ వింటుంటే నిజంగా ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. రియల్లీ ఐ ఫీల్‌ ప్రౌడ్‌. ఆయన స్థాయికి తగ్గకుండా సినిమాని ప్రజెంట్‌ చేసినందుకు కించిత్తు గర్వంగా, ఆనందంగా ఉంది... అని ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు.

Celebrities response on NTR Kathanayakudu :

Praises on NTR Kathanayakudu Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs