‘దేవ్’ విడుదల తేదీ ప్రకటించారు
జనవరి 14న కార్తి, రకుల్ ప్రీత్ దేవ్ ఆడియో.. ఫిబ్రవరి 14న సినిమా విడుదల..
కార్తి హీరోగా నటిస్తున్న దేవ్ సినిమా విడుదల తేదీ ఖరారైంది. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది దేవ్. ఈ సందర్భంగా చిత్ర ఆడియో విడుదల తేదీని కూడా కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. జనవరి 14న దేవ్ ఆడియో విడుదల కానుంది. హరీష్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. దేవ్ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాను రజత్ రవిశంకర్ తెరకెక్కిస్తున్నారు. ఖాకీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తి సరసన రెండోసారి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిక్కీ గల్రానీ ‘దేవ్’ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆర్ వేల్రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
Advertisement
CJ Advs
Karthi DEV Release Date Fixed:
DEV Movie Release on FEB 14
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads