Advertisement
Google Ads BL

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ‘చంద్రోదయం’ కౌంటర్


వెన్నుపోటు‌ అంటూ.. ‘ఎన్టీఆర్ బయోపిక్‌’కు పోటీగా వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాను రూపొందిస్తూ పాటలను విడుదల చేస్తున్న క్రమంలో.. ఇప్పుడు వర్మకు, వెన్నుపోటు పాటకు కౌంటర్‌గా ‘చంద్రోదయం’ టీమ్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘వెన్నుపోటు అని వాగే వాజెమ్మలు’ అంటూ దర్శకుడు వెంకట రమణ రాసిన పాటకు షారుక్ సంగీతాన్ని సమకూర్చారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘చంద్రోదయం’. ఈ బయోపిక్‌ను పి. వెంకటరమణ దర్శకత్వంలో జి.జె. రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. ‘‘ఆకులు ఎన్ని కాల్చినా.. బొగ్గులు కావు బ్రదర్. జిత్తులమారి నక్కలు, తోడేళ్ళు ఎన్ని ఏకమైనా అడవికి రాజు, మృగరాజు నా అల్లుడే’’ అనే లిరిక్స్‌తో ఈ పాట ఉంటుంది. చంద్రబాబునాయుడుగారు దేశ చరిత్రలోనే ఆదర్శవంతమైన నాయకుడు. ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో.. ఈ బయోపిక్‌ను తెరమీదకు తీసుకువస్తున్నాము. చిత్రీకరణ పూర్తయింది. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యమైన స్థాయికి చేరిన ఆయన జీవితాన్ని అత్యద్భుతంగా తెరమీదకు తీసుకువస్తున్నాము. నారావారి పల్లె, హైదరాబాద్, అమరావతి, సింగపూర్ వంటి లొకేషన్స్‌లో సినిమా షూటింగ్ చేశాము. మహానాయకుడి బయోపిక్‌ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..’’ అన్నారు.
Click Here For Song:

Advertisement
CJ Advs

Chandrodayam Song Released:

Chandrodayam Attacked on RGV
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs