Advertisement
Google Ads BL

రజినీ సరే.. ‘పేట’ని వాళ్లూ వదిలేశారేంటి?


సూపర్‌స్టార్ రజినికాంత్ సినిమా విడుదలవుతుంది అంటే.. ఆ హంగామానే వేరు. అప్పటికి ఇప్పటికి కోలీవుడ్ లో రజినీకాంత్ సినిమా విడుదలవుతుంది అంటే... రజిని అభిమానులు పండగ చేసుకుంటారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ రజినీకాంత్ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే... అందరూ ఎంతో ఉత్సాహంతో ఉండేవారు. కానీ రజినీకాంత్ గత సినిమా ప్లాప్స్ తో తెలుగు ప్రేక్షకులకే కాదు.. బయటి ప్రేక్షకులకు కూడా రజినీకాంత్ సినిమాలపై క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. 

Advertisement
CJ Advs

గత ఏడాది ఎన్నో అంచనాల మధ్యన విడుదలైన 2.ఓ వలన కూడా బయ్యర్లు బాగా నష్టపోవడం, లింగా, కాలా, కబాలి వరసగా ప్లాప్స్ అవడంతో.. రజినీకాంత్ సినిమాలంటే  కొద్దిగా క్రేజ్ తగ్గినమాట వాస్తవమే. అలాంటప్పుడు రజినీకాంత్ సినిమాని నిర్మించిన నిర్మాతలు ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తే సినిమాల మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడుతుంది. తాజాగా రజినీకాంత్ నటించిన పెటా కోలీవుడ్ లోను, వరల్డ్ వైడ్ గాను ఈ రోజే విడుదలకాబోతుంది. అయితే తమిళనాట భారీ ప్రమోషన్స్ చేసింది పెటా టీం.

కానీ తెలుగులో పేటని కొన్న వల్లభనేని అశోక్ కి కనీసం థియేటర్స్ దొరకని పరిస్థితి. అందుకే పేట ప్రమోషన్స్ లో వల్లభనేని తెలుగు నిర్మాతలపై దుమ్మెత్తిపోశారు. అలా ఛానల్స్ లో కూర్చుని భారీ నిర్మాతలను తిడుతున్నాడు కానీ.. పేటకి సరైన ప్రమోషన్ మాత్రం చెయ్యడం లేదు. ఏదో పేట ప్రీ రిలీజ్ కానిచ్చేసి చేతులు దులుపేసుకున్నాడు. పాపం 15 కోట్లకి తెలుగు రైట్స్ నిర్మాత కొన్నాడే.. మనం హెల్ప్ చేద్దామని రజినీకాంత్ కి గాని.. ఆ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన త్రిష, సిమ్రాన్ లకు గాని లేదు. 

రజినీకాంత్ ఈ సినిమాకు సంబంధించి తమిళ్‌లో పలు ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇచ్చాడు. కానీ తెలుగులోకొచ్చేటప్పటికీ.. అమెరికా వెళ్ళిపోయాడు. రజినీకాంత్ ఓకే.. మరి హీరోయిన్స్ కేమైంది. ఆఖరుకి ఆ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న విజయ్ సేతుపతి కూడా లైట్ తీసుకున్నాడు. 

అసలే థియేటర్స్ లేక సతమతమవుతున్న ఈ సినిమాకి ఇప్పుడు మినిమమ్ ప్రమోషన్స్ కూడా లేకుండా బరిలోకి దిగుతుంది. మరి పేట తెలుగు సినిమాల ప్రమోషన్స్ హోరులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది. 

No Promotions to Peta in Telugu:

Rajinikanth Peta Released.. but without Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs