బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ జీవిత కథ వచ్చేసింది. నిన్న ఈ సినిమా యొక్క మొదటి పార్టు ‘కథానాయకుడు’ రిలీజ్ అయి మంచి సక్సెస్ ని అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా మంచిగా వచ్చాయి. అయితే మొదటి నుండి ఎన్టీఆర్ పాత్ర లో బాలకృష్ణ ఎలా నటిస్తాడో అనేది ఆసక్తికరంగా ఉండేది. ఎన్టీఆర్‌లా హావభావాల్ని పలికించడంలో బాలకృష్ణ ప్రయత్నం సంపూర్ణ ఫలితం ఇవ్వలేదన్న కామెంట్స్ వినిపించాయి.
అలానే సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా జరిగింది. మొదటినుండి బాలకృష్ణ ఇబ్బందులు ఎదుర్కోవాల్సివచ్చింది. స్టార్టింగ్ లో డైరెక్టర్ తేజ తప్పుకోవడం.. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని కౌంటర్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం... నాగబాబు బాలకృష్ణ పైన నెగటివ్ కామెంట్స్ చేయడం.. విడుదలైన రోజు ధియేటర్ల వద్ద టిక్కెట్లు ఉచితంగా పంచిపెడ్తున్నారంటూ ప్రచారం జరగడం ఇలా చాలానే జరిగాయి.
అంతే కాదు ఈసినిమాకి థియేటర్స్ సమస్య కూడా వచ్చింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. ‘కథానాయకుడు’ మంచి సక్సెస్ ని అందుకుంది. కమర్షియల్ గా కాకపోవచ్చు కానీ ఒక సామాజికపరమైన చిత్రంగా ఇది గుర్తు ఉండిపోతుంది. సంక్రాంతి సెలవులకు ఫ్యామిలీతో కలిసి చూడదగిన మంచి సినిమా అని అంటున్నారు చూసిన ప్రేక్షకులు.