Advertisement
Google Ads BL

సంక్రాంతి పుంజులు ఓకే.. పెట్టల సంగతేంటి?


గత 20 రోజులుగా సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాల పరిస్థితి, ఆ సినిమాల్లో నటించిన హీరోల మీదే ఫోకస్ చేస్తున్నారు జనాలు, మీడియా వాళ్ళు. ఎన్టీఆర్ కథానాయకుడుతో బాలకృష్ణ, వినయ విధేయరామతో రామ్ చరణ్, ఎఫ్ టు తో వరుణ్ తేజ్ లు ఎలాంటి హిట్స్ కొడతారో.... ఈ సంక్రాంతి హీరో ఎవరో.. అంటూ అందరూ చాలా ఆసక్తితో ఉన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు మీద, చరణ్ వినయ విధేయరామ మీద ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఎన్టీఆర్‌లో క్లాస్ గా బాలకృష్ణ, వినయ విధేయరామ లో రామ్ చరణ్ మాస్ లుక్స్ తోనూ ఇరగదీస్తున్నారు.

Advertisement
CJ Advs

మరైతే ఈ సంక్రాంతికి విడుదలకాబోయే సినిమాల్లో కథానాయికల పరిస్థితి ఏమిటి. అంటే ఎన్టీఆర్ బయోపిక్ లో లీడ్ కేరెక్టర్ లో విద్యాబాలన్ నటిస్తుంది. అయితే ఎన్టీఆర్ హిట్, ప్లాప్ పై ఆమె కెరీర్‌ని డిసైడ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే విద్యాబాలన్ బాలీవుడ్ నటి. ఇక్కడ సెట్ కాకపోతే.. బాలీవుడ్ కి చెక్కేస్తుంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్, మంజిమ మోహన్ లాంటి వాళ్ళు ఎన్టీఆర్ బయోపిక్ లో కేవలం గెస్ట్ రోల్స్ ప్లే చేశారు. ఇక వారికీ సినిమా హిట్ అయినా.. లేకపోయినా పెద్ద విషయమే కాదు. ఇక రామ్ చరణ్ వినయ విధేయ రామలో హీరోయిన్ కైరా అద్వానీ కాస్త లక్ ఉన్న హీరోయిన్నే.

ఎందుకంటే.. భరత్ అనే నేను సినిమా విడుదల కాకముందే... రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో ఛాన్స్ అందుకుంది. తాజాగా వినయ విధేయ రామ విడుదలకు ముందే... అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందనే  న్యూస్ ఉంది. ఇక వినయ విధేయరామ హిట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. లేదంటే అల్లు అర్జున్, త్రివిక్రమ్ లు మరో హీరోయిన్‌ని వెతుక్కుంటారు. ఎందుకంటే అల్లు అర్జున్ సరసన కైరా ని ఇంకా ఫైనల్ చెయ్యలేదు గనక. అంటే అమ్మడుకి వినయ విధేయ రామ హిట్ కావాల్సిందే.

ఇక కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్2 లో నటించిన తమన్నా, మెహ్రీన్ కౌర్ ల పరిస్థితి ఏమిటో అనేది ఈ ఎఫ్ టు సినిమానే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తమన్నా ఫేడవుడ్ అయిన హీరోయిన్. ఇక మెహ్రీన్‌కి చేతిలో అవకాశాలే లేవు. అందుకే తమన్నా కి, మెహ్రీన్ కౌర్ కి ఈ ఎఫ్ టు కంపల్సరీ హిట్ అవ్వాలి. లేదంటే తమన్నా, మెహ్రీన్ ల పరిస్థితి మాత్రం చెప్పనలవి కాదు. చూద్దాం వరసగా విడుదలవుతున్న ఈ సినిమాల్లో హీరోయిన్స్ కి ప్రేక్షకులు ఇచ్చే తీర్పు ఏమిటనేది..

What About Heroines Situation in Sankranthi Race?:

Tamanna and Mehreen Hopes on F2 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs