Advertisement
Google Ads BL

‘సైరా’ రీ షూట్స్‌పై రామ్ చరణ్ రియాక్షన్


గత నెలలో చిరంజీవి - సురేందర్ రెడ్డి కాంబోలో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డికి సంబందించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. చిరు బరువు వలన సినిమా షూటింగ్ వాయిదాలు పడుతున్నాయని అలాగే చిరు ఎక్కువగా కలగజేసుకుని.. కొన్ని సీన్స్ ని సురేందర్ రెడ్డి చేత రీషూట్స్ చేయిస్తున్నారని....  చిరుకి సంతృప్తి కలగని సన్నివేశాలను సురేందర్ రెడ్డి పదే పదే రీషూట్స్ చేస్తున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ దగ్గరనుండి సోషల్ మీడియా వరకు బాగా చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయమై  సైరా టీం నుండి ఎలాంటి స్పందన లేదు.

Advertisement
CJ Advs

కానీ తాజాగా వినయ విధేయ రామ ఇంటర్వూస్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ తన వినయ విధేయ రామ ముచ్చట్లతో పాటుగా తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న సైరా సినిమా ముచ్చట్లను కూడా మీడియాతో పంచుకున్నాడు. ఒక మీడియా మిత్రుడు గతంలో సైరా సినిమా రీషూట్లు జ‌రుపుకుంటోంద‌ని.. దానివల్లనే సైరా విడుద‌ల ఆల‌స్యం అవుతోంద‌ని వార్త‌లొస్తున్నాయి. వీటిపై మీ స్పందన ఏమిటని అడగగా....సైరా రీ షూట్ల‌లో నిజం లేద‌ని క్లారిటీ ఇచ్చేశాడు. అంతేకాకుండా రామ్ చరణ్ కాస్త వెటకారంగా రీ షూట్లు చేసేంత డ‌బ్బు మా ద‌గ్గ‌ర లేదు.. అంటూ సైరా రీ షూట్స్ పై క్లారిటీ ఇచ్చాడు.

రీ షూట్స్ లో నిజం లేదన్న రామ్ చరణ్.. భారీ ప్రాజెక్టులకు చాలా రకాల సమస్యలుంటాయని... అందుకే అనుకున్న ప్రకారం షూటింగ్స్ పూర్తి కావని చెప్పిన చరణ్ సైరా నరసింహ రెడ్డికి 200 కోట్ల బడ్జెట్ అనుకున్నామని చెప్పాడు. ఇంకా బాలీవుడ్ కి సైరా సినిమాని తీసుకెళ్లాలనే దానికన్నా ఎక్కువగా సౌత్ లోనే సైరాని బాగా ప్రమోట్ చెయ్యాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు. అలాగే సైరా సినిమా వచ్చే దసరాకి విడుదల కావొచ్చేమో అనే చిన్న క్లూ కూడా ఇచ్చాడు చరణ్. 

Ram Charan Reaction on Sye Raa Re Shoots:

Ram Charan Latest Interview Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs