Advertisement
Google Ads BL

వీక్‌డేస్ అయినా.. ‘ఎన్టీఆర్’ హవాలో నో ఛేంజ్!


సంక్రాంతి కానుకగా ముందుగా బాక్సాఫీసు బరిలోకి దిగుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మీద ప్రేక్షకుల్లో బోలెడంత క్రేజ్ ఉంది. దర్శకుడు క్రిష్ ఎంతో స్పీడుగా చాలా నీట్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రని ఆయన కుమారుడు బాలకృష్ణే పోషించాడు. తండ్రి పాత్రలో చక్కగా ఒదిగిపోయిన బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ప్రమోషన్స్ ని పీక్స్ లో కూర్చోబెట్టాడు. బాలకృష్ణ, హరికృష్ణ పాత్రధారి కళ్యాణ్ రామ్, బసవతారకం పాత్రధారి విద్యాబాలన్, అక్కినేని పాత్రధారి సుమంత్, దర్శకుడు క్రిష్ అంతా కలిసి ఎన్టీఆర్ కథానాయకుడు ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు.

Advertisement
CJ Advs

క్రిష్ తో కలిసి ఎన్టీఆర్ టీం బెంగుళూరు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడమేకాదు.. తిరుపతిలో శ్రీవారిని దర్శించుకోవడం, నిమ్మకూరు వెళ్లి అక్కడి ఎన్టీఆర్ స్నేహితులను, సన్నిహితులను, అభిమానులతో ముచ్చడించడం ఇలా అన్ని విషయాల్లో సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలపై పై చెయ్యి సాధించింది. ఇక వారం మధ్యలో అంటే బుధవారం వీక్ డేస్ లో విడుదలవుతున్నప్పటికీ.. ఎన్టీఆర్ బుక్ మై షో బుకింగ్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. మహేష్ ఏఎంబి మల్టిప్లెక్స్ లో అయితే రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ కథానాయకుడి షోస్ పడనున్నాయి. 

మరి వారం మధ్యలో ఆఫీస్ లు, స్కూల్స్ కి సెలవలు లేకపోయినా.. టికెట్ బుకింగ్స్ మాత్రం జోరుగా తెగుతున్నాయి. అయితే మల్టిప్లెక్స్ అంటే క్లాస్ సినిమాగా ప్రమోట్ అయిన.. ఎన్టీఆర్ కి బిసి, ఎ సెంటెర్స్ లోను మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మరికొన్ని గంటల్లోనే ఎన్టీఆర్ కథానాయకుడు ఓవర్సీస్ ప్రీమియర్స్ మొదలు కాబోతున్నాయి.

No Change in NTR Craze in Week Days:

NTR Biopic Ready to Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs