Advertisement
Google Ads BL

వినయ విధేయ రామ ప్రీ క్లైమాక్స్‌ కేకంట!


బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో.. అయన గత సినిమాలు చూస్తే చెప్పెయ్యొచ్చు. తాజాగా రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అనే సాఫ్ట్ ఫ్యామిలీ టైటిల్ తో మాస్ యాక్షన్ సినిమాని తెరకెక్కించాడు. బోయపాటి - రామ్ చరణ్ లు కలిసి యాక్షన్ ని చింపేశారని.. వినయ విధేయ రామ పోస్టర్స్, ట్రైలర్, టీజర్ లలో కళ్ళకు కట్టినట్టుగా కనబడింది. రామ్ చరణ్ మాస్ లుక్స్, అయన దేహం, చరణ్ బాడీ మీద టాటూస్ అన్ని వినయ విధేయ రామకి యాక్షన్ ఎంత ముఖ్యమైనదో అడుగడుగునా తెలియజేస్తుంది. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ కి రామ్ చరణ్ కి మధ్య యాక్షన్ సీన్స్ అన్ని అదుర్స్ అనే రేంజ్ లో ఉన్నాయని ప్రస్తుత ప్రమోషన్స్ లో రామ్ చరణ్ టీం చెబుతూనే ఉంది.

Advertisement
CJ Advs

ఇక వినయ విధేయ రామకి తలమానికమైన ఓ యాక్షన్ సీన్ కి బోయపాటి ఏకంగా 12 కోట్లు ఖర్చు పెట్టాడట. దానయ్య.. బోయపాటి అడిగినదానికి కాదనకుండా బడ్జెట్ సమకూర్చాడట. ఇక బోయపాటి 12 కోట్ల యాక్షన్స్ సీన్ వినయ విధేయ రామ ప్రీ క్లైమాక్స్‌లో ఉంటుందట. ఈ భారీ బడ్జెట్ ఫైట్‌ని అజర్ బైజాన్ అనే దేశంలో చిత్రీకరించారు. ఇక ఈ యాక్షన్ సన్నివేశం బీహార్ నేపాల్ బోర్డర్ లో వచ్చే యాక్షన్ సీన్ గా ఉండబోతుంది. అయితే అంత ఖర్చు అంటే 12 కోట్లు ఈ ఒక్క యాక్షన్ సన్నివేశానికి ఖర్చు పెట్టడానికి కారణం... ఈ ఫైట్ లో పాల్గొన్న ర‌ష్య‌న్ ఫైట‌ర్ల‌ని అంటున్నారు. ప్రస్తుతం సెన్సార్ టాక్ కూడా ఈ ఫైట్‌పై పాజిటివ్‌గా రావడంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ యాక్షన్ సీన్ కోసం రష్యన్ ఫైటర్స్ ని బోయపాటి ప్రత్యేకించి తీసుకున్నాడట. ఆ రష్యన్ ఫైటర్స్ కి రోజువారీ జీత‌భ‌త్యాలే ల‌క్ష‌ల్లో ఉంటాయ‌ని టాక్‌. కేవలం ఈ ఒక్క యాక్షన్ సీన్ కాదు.. మిగతా యాక్షన్ సీన్స్ కి కూడా బోయపాటి నిర్మాతతో బాగానే ఖర్చు పెట్టించాడట. మరి అందుకే మొదటి నుండి వినయ విధేయ రామ యాక్షన్స్ సీన్స్ మీద హాట్ హాట్ గా చర్చ జరుగుతూనే ఉంది. ఇక భారీ అంచనాల నడుమ పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రేపు శుక్రవారమే ఈ సినిమా బరిలోకి దిగబోతోంది.

Vinaya Vidheya Rama Highlights Scenes:

12 Crores to Vinaya Vidheya Rama Pre Climax Fight
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs