ప్రస్తుతం తెలుగు సినిమాల హోరులో తమిళ డబ్బింగ్ మూవీ ‘పేట’కి థియేటర్స్ దొరకని పరిస్థితి. పేట తెలుగు హక్కులు కొన్న వల్లభనేని అశోక్ తెలుగు నిర్మాతలు తనకి థియేటర్స్ దొరక్కుండా అడ్డుపడుతున్నారని తప్పుపడుతున్నాడు కానీ... తెలుగులో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ క్రేజున్న సినిమాలే కాదు.... ఆ భారీ బడ్జెట్ చిత్రాలు మూడు నెలల ముందే సంక్రాంతికి విడుదల అంటూ ప్రకటించుకున్నాయి. అయితే పేట ని చాలా తక్కువ సమయంలో హక్కులు కొన్న వల్లభనేని అశోక్ మాత్రం మా చిత్రానికి థియేటర్స్ ఇవ్వడం లేదంటూ నాన్నా రాద్ధాంతం చేస్తున్నాడు.
అందుకే పేట కొచ్చిన పరిస్థితి మాకు వస్తుందని.. మరో కోలీవుడ్ హీరో తన సినిమాని తెలుగులో విడుదల చెయ్యకుండా కోలీవుడ్ లో మాత్రం ఈ పొంగల్ స్పెషల్ గా అక్కడ ‘పెట్టా’కు పోటీగా విడుదల చేస్తున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. అజిత్. ఆయన నయనతారతో కలిసి నటించిన ‘విశ్వాసం’ చిత్రం కూడా అనుకోకుండా పొంగల్ బరిలో దిగుతుంది. విశ్వాసం నిర్మాతలు కూడా చాలా తక్కువ టైం లో తమ సినిమాని పొంగల్ కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అజిత్ హీరో, గత కొంతకాలంగా వరస హిట్స్ తో దూసుకుపోతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ కావడం.. తెలుగు విలన్ కమ్ హీరో జగపతి బాబు విలన్ రోల్ ప్లే చెయ్యడం... అజిత్ - శివ కాంబోలో సూపర్ హిట్స్ ఉండడంతో విశ్వాసం సినిమాపై భారీ అంచనాలున్నాయి.
అయితే విశ్వాసం సినిమాకి తెలుగులోనూ క్రేజ్ ఉంది. అయినప్పటికీ తెలుగులో భారీ సినిమాల మీదకి దిగి అటు థియేటర్స్ దొరక్క.. ఇటు తెలుగు సినిమా కలెక్షన్స్ హడావిడిలో తమ సినిమా నలిగిపోకుండా తమిళనాట పొంగల్ కి అంటే జనవరి 10 న విడుదల చేసుకుని.. తెలుగులో ఆరమ్స్ గా జనవరి 26 అంటే రిపబ్లిక్ డే కి విడుదల చేసే ఏర్పాట్లు చేసుకుంటున్నారు నిర్మాతలు. మరి రజిని మ్యానియాతో ‘పేట’ని కొన్న నిర్మాతలు థియేటర్స్ దొరక్క నానా తంటాలు పడుతుంటే.. అజిత్ కూల్ గా జనవరి మూడో వారంలో దిగుతున్నాడన్నమాట.