90లలో నాగార్జున, రమ్యకృష్ణలది సూపర్ హిట్ కాంబినేషన్. అప్పుడు మాత్రమే కాదు ఇప్పుడు కూడా వాళ్ళ కాంబినేషన్ ఎవర్ గ్రీన్. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున, లావణ్య త్రిపాఠిల జంట కంటే నాగార్జున, రమ్యకృష్ణల పెయిరే హైలైట్ గా నిలిచింది. అందుకే తాను నటించే సినిమాల్లో మాత్రమే కాదు తాను నిర్మించే సినిమాల్లో కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా రమ్యకృష్ణను క్యాస్ట్ చేసుకోవడానికి ఏమాత్రం జంకడు నాగార్జున. మరి నాగార్జునతో ఇంత క్లోజ్ రిలేషన్ ఉన్న రమ్యకృష్ణ.. తనకు అత్యంత ఆప్తుడైన నాగార్జున పరపతిని, పవర్ ను తన స్వప్రయోజనాలకు వాడుకోకుండా ఉంటుందా చెప్పండి.
నక్షత్రం సినిమా తర్వాత తన భర్త మరియు క్రియేటివ్ జీనియస్ కృష్ణవంశీతో సినిమాలు రూపొందించడానికి ఇండస్ట్రీలోని నిర్మాతలెవరూ ధైర్యం చేయలేదు. అయితే.. ఇప్పుడు రమ్యకృష్ణ తనకున్న కాంటాక్ట్స్ లో చాలా కీలకమైన నాగార్జునను అడిగి మరీ తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మింపజేసేందుకు సన్నాహాలు చేస్తుందట. నిజానికి నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన నిన్నే పెళ్లాడతాతోపాటు మోడరేట్ హిట్ గా నిలిచిన చంద్రలేఖ చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణవంశీకి నాగార్జునతో ఏవో గొడవలు వచ్చాయి. ఆ తర్వాత అక్కినేని కాంపౌండ్ లోకి అడుగుపెట్టలేదు కృష్ణవంశీ.
మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రమ్యకృష్ణ కలగజేసుకోవడంతో కృష్ణవంశీ గురించి ఆలోచించడం మొదలెట్టాడు నాగార్జున. మరి ఈ చర్చలు ఫలించి కృష్ణవంశీకి ఒక సినిమా వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు కానీ.. ఈ వార్తల పుణ్యమా అని అందరూ మర్చిపోతున్న కృష్ణవంశీ మళ్ళీ వార్తల్లో నిలిచాడు.