Advertisement

సరికొత్త ఐడియా: ఎన్టీఆర్ 100 విగ్రహాలు


మహానుభావుడు, మహానటుడు నందమూరి తారకరామారావు గారి జీవితం ఆధారంగా  తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలోనే  సరికొత్త ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఎన్టీఆర్ చిత్రయూనిట్. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన 100 థియేటర్లలో ఎన్టీఆర్ 100 విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. తొలి విగ్రహాన్ని నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్ తిరుపతి పీజేఆర్ థియేటర్ లో మంగళవారం విడుదల చేయనున్నారు. జనవరి 7, 8 తేదీల్లో నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నిమ్మకూరు, బెంగళూరు, తిరుపతి వెళ్లి కథానాయకుడు ప్రమోషన్ లో పాల్గొననున్నారు. ఆ తర్వాత విగ్రహం విడుదల చేయనున్నారు బాలయ్య, విద్యాబాలన్. ఈ కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు ఎన్టీఆర్ చిత్ర యూనిట్. ఎన్టీఆర్ బయోపిక్ లో తొలిభాగం ఎన్టీఆర్ కథానాయకుడును దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు.

Advertisement

నటీనటులు..

నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్ vk, మురళీ శర్మ, జిష్షు సేన్ గుప్తా, నిత్యా మీనన్, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రాజా, కైకాల సత్యనారాయణ..

100 Idols of NTR in 100 Theatres:

100 Idols of NTR Will be Laid for Public Viewing in 100 Selective Theatres
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement