Advertisement
Google Ads BL

అప్పుడు ‘పిజ్జా’కు వచ్చా.. మళ్లీ ‘పేట’కే!


సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరో‌గా నటిస్తున్న చిత్రం ‘పేట’. సిమ్రాన్, త్రిషలు కథానాయికలు. సాంగ్స్, ట్రైలర్‌తో మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు హీరో శ్రీకాంత్, దర్శకుడు వైవీఎస్ చౌదరి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘నవాబ్, సర్కార్ లాంటి సూపర్ హిట్ సినిమాలను రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ వల్లభనేని అశోక్‌గారికి.. రజినీకాంత్‌గారు నటించిన ఈ సినిమా కూడా అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నాను. పెద్ద పెద్ద సినిమాలతో పోటీపడుతూ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. మా ఆర్టిస్టులందరికి రజినీకాంత్‌గారు చాలా ఇన్స్పిరేషన్. సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా కూడా బాగా ఆడాలి..’’ అన్నారు.. 

గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ‘‘రజినీకాంత్ గారికి పాటలు రాసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఆయన పాటల్లో మంచి మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా నేను మంచి పాట రాసినందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎంతో ఉత్సాహంతో పాట రాశాను. మంచి సంతృప్తి కలిగించింది. రజినీకాంత్‌గారు చాలా బాగా కనిపించారు. ఈ సినిమా ద్వారా వల్లభనేని అశోక్‌గారికి మంచి లాభాలు రావాలని కోరుతున్నాను’’ అన్నారు. 

దర్శకుడు వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్, ఆసక్తి కలిగిన నిర్మాత వల్లభనేని వంశీ. టాలీవుడ్‌లో థియేటర్ల సమస్య ఉన్నా కూడా అలాంటి టైం లో స్టార్ కాస్ట్‌ని, సినిమా పట్ల ఇష్టంతో సినిమాలు రిలీజ్ చేస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.. అయన చేసిన పెద్ద సాహసం ఇది. ఇక ఈ సినిమాతో పూర్వపు రజినీకాంత్ గారిని చూస్తున్నాను అనుకుంటున్నాను. కార్తీక్ సుబ్బరాజు‌గారు ఆయనను చాలా బాగా ప్రజెంట్ చేశారు. నటీనటులను కూడా దమ్మున్న నటీనటులను ఎంచుకున్నారు. అందరూ కథను నమ్మి సినిమా చేసేవాళ్ళు. అలాంటి వాళ్లు ఉన్న ఈ సినిమాకు ఒప్పించడమంటే అక్కడే సినిమా సూపర్ హిట్ అని అర్థమవుతుంది. ఈ సినిమా తప్పకుండా హిట్టవుతుంది. అందరూ ఆదరించాలి’’ అని అన్నారు.

నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ.. ‘‘రజినీకాంత్‌గారి స్ఫూర్తితోనే ఆయన సినిమా చేసే స్థాయికి చేరుకున్నాను. సినిమా థియేటర్‌ల విషయంలో చాలా మంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లకు ఈ సినిమా హిట్‌తో బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని కేసీఆర్‌గారిని కోరుకుంటున్నాను..’’ అన్నారు. 

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ అశోక్ గారికి కంగ్రాట్స్. ఈ సినిమా రజిని ఫ్యాన్స్ కోసమే. ఆయన ఇరగదీశారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కార్తీక్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన అందరు లిరిసిస్ట్స్ చాలా చక్కని సాహిత్యంతో పాటలు ఇచ్చారు. నన్ను ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమా అందరికి నచ్చుతుంది. థియేటర్స్‌లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు.. అన్నారు. 

హీరోయిన్ మేఘ ఆకాష్ మాట్లాడుతూ.. ‘‘ఇంత గొప్ప సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన కార్తీక్ గారికి, సన్ పిక్చర్స్ వారికి చాలా థ్యాంక్స్. సినిమాలో నాకు మంచి పాత్ర వచ్చింది. సినిమాలో అందరితో నటించే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది. థియేటర్‌కు వెళ్లి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.

నటుడు బాబీ సింహ మాట్లాడుతూ.. ‘‘రజినిగారితో పనిచేశాననే ఆలోచనే నాకు ఎంతో సర్‌ప్రైజింగ్‌గా ఉంది. దేవుడిని చూశాననే ఫీలింగ్ కలిగింది. కార్తీక్‌గారు ఈ పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఆయన మంచి డైరెక్టర్. ఆయన చేసిన సినిమాలు ఆయన ఏంటో చెప్తాయి. అనిరుధ్‌గారితో పనిచేయడం మరిచిపోలేనిది’’ అన్నారు. 

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. ‘‘నామొదటి సినిమా పిజ్జా కోసం హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ రజినీకాంత్‌గారి సినిమాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి కష్టపడి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న అశోక్ గారికి కంగ్రాట్స్. సినిమా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్, యాక్షన్ ఫిలిం ఇది. మీ అందరూ ఈ సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందరూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి..’’ అన్నారు.

Peta Pre Release Event Highlights:

Celebrities Speech at Peta Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs