Advertisement
Google Ads BL

అక్కడ ‘పేట’ పరిస్థితి ఏమిటో..?


ప్రస్తుతం రజినీకాంత్ మార్కెట్ కి ఓ అన్నంత క్రేజ్ లేదు. ఎందుకంటే ఆయన.. గత ఏడెనిమిదేళ్ళుగా హిట్ కొట్టిన సందర్భమే లేదు. రోబో సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ రజినీకాంత్ కొట్టలేకపోయాడు. కనీసం మొన్న విడుదలైన 2.ఓ సినిమాని కొన్న బయ్యర్లు కూడా బాగా లాస్ అయ్యారు. ఇక లింగా, కబాలి, కాలా ఇలా వరసగా సినిమాలు పోవడంతో రజినీకాంత్ కి మార్కెట్ అనూహ్యంగా పడిపోయింది. రజిని చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ... సినిమా టాక్ తో కలక్షన్స్ మాత్రం అమాంతం పడిపోతాయి. తాజాగా రజిని - కార్తీక్ సుబ్బరాజుల పేట చిత్రం వరల్డ్ వైడ్ గా జనవరి 10 న విడుదలకాబోతుంది.

Advertisement
CJ Advs

అయితే తెలుగులో ఓ మాదిరి బిజినెస్ ని జరుపుకున్న పేట సినిమా తమిళనాట మాత్రం భారీ బిజినెస్ జరుపుకుంది. తెలుగులో గతంలో రజినీకాంత్ సినిమాలకు భీభత్సమైన పోటీ ఉండేది. కానీ గత కొంతకాలంగా రజిని నుండి  వస్తున్న సినిమాలతో బయ్యర్లు బెంబేలెత్తుతున్నప్పుడు.. ఇక నిర్మాతలెవరూ రజినీకాంత్ సినిమాలు ఏ ధైర్యంతో కొంటారు. అయితే తెలుగులో వల్లభనేని అశోక్ 15 కోట్లకు  పేట తెలుగు డబ్బింగ్ హక్కులను దక్కించుకోగా... ఓవర్సీస్ లో తెలుగు, తమిళ హక్కులను కలిపి 10 కోట్లకు అమ్మారు. అయితే ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు జోరెక్కువ.

మరి ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు ఎన్టీఆర్, వినయ విధేయ రామ, ఎఫ్ టు లను తట్టుకుని పేట లాభాలను తేవాలంటే కాస్త కష్టమైన పనే. మరి అక్కడ పేట బ్రేక్ ఈవెన్ రావాలంటే ఎలా లేదన్నా.. 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. కానీ తెలుగు సినిమాల హడావిడిలో పేట 2.5 మిలియన్ డాలర్లు వసూలు చెయ్యడం సామాన్యమైన విషయం కాదు. అందులోను రజిని సినిమాలకు క్రేజ్ బాగా పడిపోయింది. మరి ఇప్పుడు ఈ సంక్రాంతికి ఓవర్సీస్ లో తెలుగు సినిమాల హడావిడిలో పేట పరిస్థితి ఏమిటో చూద్దాం.

No Craze on Peta At Overseas:

What About Peta Position in Overseas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs