గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా బోల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమా అనుకోని విజయాన్ని సాధించింది. యూత్ కి బాగా ఆసక్తి కలిగించిన ఈ సినిమాతో హీరోకి, హీరోయిన్ కి, దర్శకుడికి కూడా మంచి పేరొచ్చింది. కార్తికేయ హీరోగా పాయల్ రాజపుత్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా హిట్ తర్వాత అజయ్ భూపతికి మంచి మంచి ఛాన్స్ లు వచ్చాయని. అసలు బాలీవుడ్ కి వెళ్ళిపోతున్నాడనే ప్రచారం మాములుగా జరగలేదు.
ఇక నితిన్, రామ్ లైతే అజయ్ భూపతిని పిలిచి అవకాశమిచ్చినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే నితిన్, రామ్ లు అజయ్ ని కలిసిన మాట వాస్తవమేనట. అలాగే అజయ్ పెళ్లికి నితిన్ తో పాటుగా రామ్ కూడా హాజరయ్యేసరికి వారి కాంబోలో మూవీ ఫిక్స్ అన్నట్లుగా మాట్లాడుకున్నారు. అయితే తాజాగా అజయ్ భూపతి మరో యంగ్ హీరోతో సినిమా చెయ్యబోతున్నాడు. అతనెవరో కాదు... హీరోగా నిలదొక్కుకోకముందే భారీ బడ్జెట్ తో సినిమాలు చేసే బెల్లంకొండ శ్రీనివాస్. అయితే ఇలా యంగ్ హీరోకి అజయ్ కమిట్ అవడానికి కారణం పారితోషకం అనే మాట ఫిలింనగర్ లో వినబడుతుంది.
రామ్ అండ్ నితిన్ లకు కథ చెప్పగా... వారు అజయ్ కి కమిట్ అయినా.. అతని పారితోషకం కింద 50 లక్షలు ఇస్తామని చెప్పడంతో.. ఆ పారితోషకం నచ్చక అజయ్ వారితో సినిమాలు చేయడానికి నెమ్మదించడం.. ఈలోపు బెల్లంకొండ శ్రీనివాస్ ని కలిసి కథ చెప్పగా శ్రీనివాస్, అజయ్ కి కోటి యాభై లక్షలు ఆఫర్ చేయడంతోనే అజయ్ వెంటనే శ్రీనివాస్ తో సినిమాకి కమిట్ అయ్యాడనే టాక్ నడుస్తుంది. మరి బెల్లంకొండతో సినిమా చేసేవారికి భారీ పారితోషకం అనేది పరిపాటే. కాకపోతే హిట్ ఇస్తే గనక ఆ డైరెక్టర్ కి కూడా డబ్బుతోపాటుగా పేరొస్తుంది. లేదంటే డబ్బొస్తుంది అంతే.