Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ చివరి చిత్రం ఆ దర్శకుడితోనే!


కుర్ర హీరోలతో సమానంగా సినిమాల మీద సినిమాలు చేస్తున్న రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై కూడా అంతే ఆసక్తి కొనసాగుతుంది. రజినీకాంత్ గత రెండేళ్లుగా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు.... కారణం ఆయన ఇలా వరసగా సినిమాలు చేసి రాజకీయాలతో బిజీ అవుతాడని అన్నారు. ఇక రజినీ పొలిటికల్ ఎంట్రీపై ఆయన అభిమానులు విపరీతమైన ఆసక్తితో ఉన్నారు. కానీ రజినీకాంత్ మాత్రం రాజకీయాలపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా నాన్చుతూనే ఉన్నాడు. తాజాగా పేట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రజినీకాంత్ వరసగా అరడజను సినిమాలను లైన్ లో పెట్టాడంటున్నారు.

Advertisement
CJ Advs

అది కూడా రాజమౌళి సినిమాతో కలిపి అంటున్నారు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజుతో పేట సినిమా చేసిన రజినీకాంత్.. తన తదుపరి అంటే తన 166 వ చిత్రాన్ని మురుగదాస్ డైరెక్షన్ లోను.... 167వ చిత్రాన్ని సురేష్ కృష్ణ డైరెక్షన్ లోను, 168వ చిత్రాన్ని కేఎస్ సుబ్బరాజ్ తో, 169వ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తారని.... ఆ తర్వాత తన తదుపరి అంటే కెరీర్ లో మైలు రాయిలా నిలిచిపోయే 170 వ అండ్ చివరి చిత్రాన్ని టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తాడని తెలుస్తుంది. ఇక రాజమౌళి చిత్రమే రజినీకాంత్ నటనకు చివరి చిత్రమనే టాక్ బాగా వినబడుతుంది. 

ఇక రాజమౌళి చిత్రం తర్వాత సినిమాలకు బై బై చెప్పేసి పూర్తిగా రాజకీయాలకే రజినీకాంత్ పరిమితం కాబోతున్నారనేది లేటెస్ట్ న్యూస్. మరి వరసగా ఇన్ని చిత్రాలను లైన్ లో పెట్టేసిన రజినీకాంత్ సంవత్సరానికి రెండేసి సినిమాల చొప్పున పూర్తి చేసి ఇక రాజకీయాలతో బిజీ అవ్వాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి ఈ రజినీ లిస్ట్ లో రాజమౌళి కూడా ఉండేసరికి రజినీ - రాజమౌళి కలిస్తే సంచలనాలే అంటూ రజినీ అభిమానులప్పుడే ఆ సినిమాపై ప్రేమ చూపించేస్తున్నారు.

Rajinikanth Last Film Director Fixed :

Rajinikanth-Rajamouli film on cards <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs