Advertisement
Google Ads BL

బాలయ్యపై నాగబాబు డైరెక్ట్ అటాక్..!


నాగబాబు వరసగా బాలకృష్ణని ఉద్దేశించి సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ హాట్ హాట్ గా ఇండస్ట్రీలోను, అభిమానుల్లోను చర్చకు దారితీశాయి. నాగబాబు కావాలనే పనిగట్టుకుని బాలకృష్ణని కెలుకుతున్నాడు అంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ నాగబాబు మీద ఫైర్ అవుతున్నారు. ఇక మరోపక్క మెగా ఫ్యాన్స్ కూడా నాగబాబు చేసే వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్నారనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా... నిన్న శనివారం నాగబాబు తమిళనాట ఒక కాలేజ్ ఫంక్షన్ లో పాల్గొనగా.. అక్కడ కూడా బాలయ్య అభిమానులు నాగబాబు స్టేజ్ ఎక్కగానే జై బాలయ్య అంటూ నాగబాబు స్పీచ్ కి అడ్డుపడ్డారు. 

Advertisement
CJ Advs

ఇక నాగబాబు నెమ్మదిగా తేరుకుని బాలయ్య నటించిన లెజెండ్ స్టెప్ వేసినా... అక్కడి బాలయ్య అభిమానుల నిరసన సెగలు తగ్గలేదు. దెబ్బకి దిగొచ్చిన నాగబాబు మళ్ళీ పేస్ బుక్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు.

బాలకృష్ణ పేరు ఎక్కడ ఉచ్చరించకుండా నాగబాబు జాగ్రత్త తీసుకుని మరీ ఆ వీడియోలో బాలయ్యను ఉద్దేశించి మాట్లాడాడు. అదేమంటే.. నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లు చూసి మీరు చాలా హర్ట్ అయ్యారు. ఆ వ్యక్తి మా మెగా ఫ్యామిలీని చాలా సార్లు అంటే దాదాపుగా ఐదారు సార్లు టార్గెట్ చేసి మాట్లాడడము... అలాగే పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని అన్నాడు. 

అయినా పవన్ కళ్యాణ్ గాని మా అన్న చిరు గాని అందరికి తెలియాలని రూల్ లేదు. కాకపోతే మా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తి యొక్క పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడంలో ఎంతో సహాయం చేశాడు. పవన్ వల్లే ఆనాడు ఆ వ్యక్తి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాంటి వ్యక్తికి పవన్ మీద అభిమానం లేకపోయినా పర్లేదు కానీ.. తెలియదని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పడమే కాదు.. సదరు వ్యక్తి మా ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడితే.. తప్పులేదు కానీ.. నేను మాట్లాడితే తప్పా.. అంటూ అభిమానులను ఉద్దేశించి నాగబాబు ఆ వీడియోని పోస్ట్ చేశాడు.

Nagababu's Intense Criticism on Balakrishna:

And Now, Nagababu Directly Attacks Balayya  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs