Advertisement
Google Ads BL

బాహుబలి తరహా చరణ్ ‘వివిఆర్’ పిక్ వైరల్!!


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రానా విలన్ గా తెరకెక్కిన బాహుబలి పార్ట్ వన్ అండ్ టు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమాలో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ విశ్వరూపాన్ని చూసాం. ఇక భళ్లాల దేవునిగా రానా జీవించాడు. బాహుబలి, భళ్లాల దేవుని మధ్యన జరిగిన చివరి యాక్షన్ సన్నివేశం సినిమాకే హైలెట్ అనేలా ఉంది. అందులో బాహుబలికి భళ్లాల దేవునికి జరిగిన యుద్ధం ప్రేక్షకులు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఇక ప్రభాస్, రానా ఢీ అంటే ఢీ అంటూ తలలు ఆనించిన పోస్టర్  అండ్ సీన్ సూపర్ గా హైలెట్ అయ్యింది. అయితే రాజమౌళి ఆ రకమైన పోస్టర్ ని హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టినట్లుగా ప్రచారం జరిగింది. ఇక దర్శకుడు శంకర్ కూడా 2.ఓ కోసం రజినీకాంత్ - అక్షయ్ కుమార్ ల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్టుగా బాహుబలి లాంటి పోస్టర్ నే డిజైన్ చేయించాడు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా బాహుబలి చూసి బోయపాటి కూడా బాగా ఇన్స్పైర్ అయినట్లుగా అనిపిస్తుంది. రామ్ చరణ్ హీరోగా, వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న వినయ విధేయ రామ కోసం దర్శకుడు బోయపాటి బాహుబలి పోస్టర్ ని కాపీ కొట్టేసాడు. రామ్ చరణ్, వివేక్ ఒబెరాయ్‌లు ఢీకొట్టే ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. మరి బోయపాటి యాదృచ్చికంగా ఆ ఫొటోస్ డిజైన్ చేసాడో... లేదంటే బాహుబలి ని చూసి కాపీ కొట్టాడో కానీ చెర్రీ, వివేక్ ల ఆ భీభత్సమైన లుక్ ఇపుడు నెట్‌‌లో తెగ వైరల్ అయ్యింది.

Vinaya Vidheya Rama Follows Baahubali:

Ram Charan and Vivek Oberai Photo Viral in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs