Advertisement
Google Ads BL

బోయపాటి కావాలనే ఇలా చేస్తున్నాడా..?


రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘వినయ విధేయ రామ’ మరి కొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే టీజర్, ట్రైలర్‌లో మరీ మాస్‌ మసాలా ఎక్కువయిందనే కంప్లయింట్స్‌ వస్తున్నా.. బయ్యర్లు ఆందోళన చెందుతున్నా బోయపాటి తన రూట్ మార్చలేదు. దీన్ని మాస్ సినిమాగానే ప్రమోట్ చేయాలని చూస్తున్నాడు బోయపాటి.

Advertisement
CJ Advs

నిజానికి టైటిల్ డిసైడ్ చేసినప్పుడే ‘జయ జానకి నాయక’ మాదిరిగా ఫ్యామిలీ సినిమా అన్నట్టు ప్రమోట్‌ చేద్దామనే అనుకున్నాడట. కానీ ఎందుకో టీజర్ కి ముందు తన మనసు మార్చుకుని మాస్ మూవీ గానే చూపించాలని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇందులో యాక్షన్ ఎలెమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు ఇదేంటి ఇలా ఉంది అనకూడదని.. ముందుగానే ఈ సినిమా ఇలా వుండబోతుందనే థియేటర్స్ కి రావాలని బోయపాటి భావించి ఇలా చేసాడట.

ఫ్యామిలీ టచ్ ఉన్నా.. ఈ సినిమా చూడడానికి ఫ్యామిలీస్ ఎంత వరకు థియేటర్‌కు వస్తారనేది చూడాలి. యాక్షన్‌ లోడెడ్‌ పోస్టర్లు మాత్రమే ఏరి కోరి వదులుతున్నాడు బోయపాటి. ఫ్యామిలీస్‌కు నచ్చేలా ఇప్పటి వరకు రెండు మూడు పోస్టర్స్ మాత్రమే వదిలాడు కానీ అవి సినిమాపై హైప్ తెప్పించే అవకాశం లేదంటున్నారు. దాంతో ఫ్యామిలీస్‌తో పాటు ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమాకి పూర్తిగా దూరం అయ్యే అవకాశముందని.. బి,సి సెంటర్స్‌కే ఈ సినిమా పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఏ సెంటర్స్ ప్రేక్షకుల కోసం ఏదైనా చేయమని మెగాభిమానులు వేడుకుంటున్నారట.

Bayapati shows only Mass in Charan:

Boyapati Srinu not Changed his Route
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs