Advertisement
Google Ads BL

NTRలో యంగ్‌టైగర్‌కు ఛాన్స్ ఇవ్వంది అందుకే!


ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో ఆ సినిమాలో హరికృష్ణ రోల్ ప్లే చేస్తున్న కళ్యాణ్ రామ్, తన బాబాయ్ ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ‌తో కలిసి పలు ఛానల్స్ లో ఇంటర్వూస్ లో పాల్గొంటున్నాడు. అయితే నందమూరి ఫ్యామిలీ మొత్తం ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ తో సహా ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైనప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ బయోపిక్ లో చిన్న పాత్ర కూడా ఇవ్వలేదని నందమూరి అభిమానులు ఫీల్ అవుతున్నారు. కేవలం అభిమానులే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు తారక్ కి.. ఎన్టీఆర్ బయోపిక్ లో ఛాన్స్ ఇస్తే బావుండేదన్నారు.. అయితే ఆ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కూడా పెదవి విప్పలేదు.

Advertisement
CJ Advs

తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ ఇంటర్వ్యూ లో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్.. తారక్ ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించకపోవడానికి గల కారణం చెప్పాడు. అదేమిటంటే ఎన్టీఆర్ బయోపిక్ లో మా పాత్రలంటే హరికృష్ణ లాంటి పాత్రలు చాలా చిన్నవి. అందులో తారక్ కి చిన్న పాత్ర ఇస్తే అభిమానులు ఫీల్ అయ్యేవారు. తారక్‌కు తాతయ్య బయోపిక్‌లో ఏ పాత్ర ఇచ్చినా చేసుండేవాడు... కానీ అదే జరిగితే నందమూరి అభిమానులు తారక్‌కు ఇంత చిన్న పాత్ర ఇచ్చారా...  అని నిరుత్సాహపడే పరిస్థితి వచ్చుండేదని.... అందువల్లే తారక్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించలేదని కళ్యాణ్ రామ్ చెబుతున్నాడు.

ఎన్టీఆర్ బయోపిక్‌లో తారక్ కి పాత్ర లేకపోతేనేమిటి ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకలో బాలయ్య బాబాయ్ తారక్ ని దగ్గరికి తీసుకున్నాడని.. తారక్ కి ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్ లో బాబాయ్ సముచిత స్థానం ఇచ్చాడని చెప్పాడు. ఈవెంట్ లో తారక్ ని భాగం చెయ్యడం కన్నా ఇంకేం కావాలని అని చెప్పుకొచ్చాడు. ఇది తారక్ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎందుకు నటించలేదో అనే ప్రశ్నకు కళ్యాణ్ రామ్ సమాధానం.

Kalyan Ram About NTR Biopic :

Thats way Jr NTR not in NTR Biopic says Kalyan Ram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs