Advertisement
Google Ads BL

యూట్యూబ్‌ చానెల్స్‌ పెట్టే హెడ్డింగ్స్ వల్లే: ఝాన్సీ


నిన్న మొన్నటి దాకా తెలుగు బుల్లితెరను ఏలిన వారిలో సుమా, ఝాన్సీ, ఉదయభానులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరీ అనసూయ, రష్మివంటి గ్లామర్‌షోలు చేయకపోయినా వీరి స్థానం, మాటల చాతుర్యం అద్భుతం. ఇప్పటికీ సుమ టాప్‌ రెమ్యూనరేషన్‌ తీసుకునే యాంకర్‌గా తన సత్తా చాటుతోంది. కానీ కొన్ని చిత్రాలలో కూడా నటించిన ఝూన్సీ, ఉదయభాను వంటి వారు మాత్రం కాస్త ఫేడవుట్‌ అయ్యారు. ఇక యాంకర్లుగా పోటాపోటీగా ఉండే సుమ, ఝాన్సీలు ఎంతో ప్రాణ స్నేహితులు. 

Advertisement
CJ Advs

ఒక వైపు సుమ అటు ఇంటి బాధ్యతలు, కెరీర్‌ విషయంలో సమతూకం పాటిస్తే అది మాత్రం ఝాన్సీకి వీలుకాలేదనే చెప్పాలి. వైవాహిక బంధం విచ్చిన్నం కావడం, జగపతిబాబు విషయంలో వచ్చిన రూమర్స్‌, జోగినాయుడు వ్యవహారం.. ఇలా ఎన్నో వివాదాలు వచ్చినా ఆమె ధైర్యంగా నిలబడింది. ఇక సుమ ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండే కార్యక్రమాలకు హోస్ట్‌గా చేస్తే, ఝాన్సీ మాత్రం సామాజిక బాధ్యత ఉండే దారిని ఎంచుకుంది. 

ఇక విషయానికి వస్తే తాజాగా ఝాన్సీ కాస్టింగ్‌ కౌచ్‌తో పాటు తనపై వస్తున్న గాలి ప్రచారాలపై కూడా స్పందించింది. కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘శ్రీరెడ్డి బయటపెట్టిన కాస్టింగ్‌కౌచ్‌ విషయంలో ఆమె సరైన పనే చేసింది. కానీ మద్యలో గాడి తప్పింది. అదే ఆ సమయంలో మేము ఆమెకి మద్దతు ఇచ్చి ఉంటే మా మీద కూడా బురదచల్లేవారు. కానీ నేను, నాతో పాటు మంచు లక్ష్మి, ఇతరులతో కాస్టింగ్‌కౌచ్‌పై ఓ సెల్‌ని ఏర్పాటు చేశాం. కాస్టింగ్‌కౌచ్‌ ద్వారా ఇబ్బంది పడే వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. అయితే ప్రస్తుతం సినీ పెద్దలు తీసుకుంటున్న చర్యల వల్ల ఇది కాస్త తగ్గిందనేది నిజం. 

నాకు తెలిసి ప్రతి నటి ఏదో ఒకసారి ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నవారే. ఎంతో మంది అమాయకులు దీనికి బలయ్యారు. అందరు నటీమణులు షేక్‌ హ్యాండ్‌ విషయంలో చేతిని నలిపేస్తుంటే బాధపడిన వారే. నటీమణులను చిన్నచూపు చూస్తూ, అదే దృష్టితో పావుగంట పాటు చేతిని నలిపేస్తారు. అలా బాధపడిన వారు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయాలంటే కాస్త భయపడుతున్నారు. 

ఇక నాపై ఏవేవో వార్తలను యూట్యూబ్స్‌ ప్రచారం చేస్తున్నాయి. ఏదో జరిగింది అన్నట్లుగా హెడ్డింగ్‌లో సెన్సేషన్‌ కోసం ప్రయత్నిస్తూ అసలు విషయం వారి ఇష్టం వచ్చినట్లు వక్రీకరిస్తున్నారు. నేను చెప్పింది పట్టించుకోవడం లేదు. కాస్టూమ్‌ డిజైనర్‌‌లు నాకేదో జరిగింది అని అడుగుతున్నారు. ఇలా అడిగే వారందరు ఆయా యూట్యూబ్‌ చానెల్స్‌ పెట్టే హెడ్డింగ్‌లని చూసి అడుగుతున్న వారేనని తేల్చిచెప్పింది. 

ఈ ఇంటర్వ్యూకి కూడా ఆ వెబ్‌సైట్‌ ‘ఇంటర్వ్యూయర్‌పై మండిపడిన ఝాన్సీ’ అనే విధంగా హెడ్డిండ్‌ పెట్టడం చూస్తుంటే ఈ మీడియా గుడిసె కాలి ఒకడు ఏడుస్తుంటే బీడీ ముట్టించుకోవడానికి నిప్పడిగాడనే సామెత ఖచ్చితంగా అర్ధమవుతుంది...! 

Anchor Jhansi Latest Interview:

Jhansi Counters on Youtube Channels
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs