Advertisement
Google Ads BL

2019‌.. ఈ సినిమాల కోసమే వెయిటింగ్!


2018 విషయానికి వస్తే ‘అజ్ఞాతవాసి, జైసింహా, రంగులరాట్నం’ ఇలా వరుసగా సంక్రాంతి చిత్రాలు మెప్పించలేకపోయాయి. అనుష్క నటించిన ‘భాగమతి’, వరుణ్‌తేజ్‌ ‘తొలిప్రేమ’లు హిట్‌గా నిలిచాయి. కానీ అసలు సిసలు బ్లాక్‌బస్టర్‌ మాత్రం రామ్‌చరణ్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా లభించింది. ఆ తర్వాత పలు చిత్రాలు బాగానే ఆడాయి. కానీ కిందటి ఏడాదితో పోలిస్తే ఈ సంక్రాంతి సీజన్‌ బ్లాక్‌బస్టర్‌తోనే స్టార్ట్‌ కావడం ఖాయమని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. 

Advertisement
CJ Advs

బాలకృష్ణ నటిస్తోన్న ‘కథానాయకుడు’ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తర్వాత క్రిష్‌ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం కావడం దీనికి అదనపు ప్లస్‌ పాయింట్‌. ఇక ‘రంగస్థలం’ తర్వాత బోయపాటిశ్రీను, దానయ్యల కాంబినేషన్‌లో రామ్‌చరణ్‌ నటించిన ‘వినయ విధేయ రామ’ మీద కూడా భారీ అంచనాలున్నాయి. ఆ తర్వాత ‘కథానాయకుడు’కి సెకండ్‌ పార్ట్‌గా రూపొందుతున్న ‘మహానాయకుడు’ వరుసగా రెండు చిత్రాలతో నిరుత్సాహపరిచిన అక్కినేని అఖిల్‌, ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి-బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ల ‘మజ్ను’పై అక్కినేని అభిమానుల ఆశలున్నాయి. 

నిఖిల్‌ ముద్రతో పాటు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర పాయింట్‌తో మమ్ముట్టి వైఎస్‌ఆర్‌గా కనిపించనున్న ‘యాత్ర’, మెగాస్టార్‌ చిరంజీవి ‘సై..రా..నరసింహారెడ్డి’, ప్రభాస్‌ ‘సాహో’, మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’, విజయ్‌దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’లు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక గత ఏడాది ‘కృష్ణార్జున యుద్దం, దేవదాస్‌’లతో పెద్ద హిట్‌ లేని నేచురల్‌ స్టార్‌ నానికి, ఆశించిన స్థాయిలో ఆడని ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా, డిజె’ తర్వాత స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ నటించే చిత్రం, వరుసగా డబుల్‌ హ్యాట్రిక్‌ ఫ్లాప్‌లు నమోదు చేసుకున్న మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ కిందటి ఏడాది వచ్చిన ‘ఇంటెలిజెంట్‌, తేజ్‌ ఐలవ్‌యు’ల తర్వాత ఈ ఏడాది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్స్‌ కొట్టాల్సిన అవసరం ఉంది. 

ఇక ఈ ఏడాది ప్రభాస్‌, మెగాస్టార్‌ చిరంజీవిల డ్రీమ్‌ప్రాజెక్ట్స్‌తో పాటు బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ, బెల్లంకొండ వారి కొత్త వారసుడు.. ఇలా పలు అంశాలకు ఈ ఏడాది సాక్షిభూతంగా నిలవనుంది. 

2019 Most Awaited films:

Sye Raa and Saaho are Top List in 2019 Release movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs