Advertisement
Google Ads BL

రామ్ కొ.ణి.దె.ల.. టైమ్ స్టార్ట్స్.. !


ఇప్పుడు రామ్ చరణ్ టాటూ వేయించుకున్నఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సూపర్ ఫిట్నెస్ గా ఉన్న రామ్ చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న వినయ విధేయ రామ కోసం బాడీని అదుర్స్ అనేలా బిల్డప్‌ చేసాడు. ఇక వినయ విధేయరామ ట్రైలర్‌లో తన సిక్స్ ప్యాక్... కాదు కాదు కండలు తిరిగిన తన విశ్వరూపాన్ని చూపాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రామ్ చరణ్ బాడీని హైలెట్‌ చేస్తూ.. పచ్చబొట్టుతో ఉన్న సీన్స్ హైలెట్‌గా నిలిచాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ టాటూస్ వేయించుకుని బాడీ ని ఎక్సపోజ్ చేస్తూ తీసిన ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. చేతి కండరాల మీద, ఎద రొమ్ముల మీద రామ్ చరణ్ స్పెషల్ గా వేయించుకున్న టాటూస్ అదిరిపోతున్నాయి.

Advertisement
CJ Advs

అసలు రామ్ చరణ్ బాడీని ఇంతగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ బిల్డప్‌ చేసుకోవడానికి చేయాల్సిన పనులు.... పాటించాల్సిన సూచనలు తెలుపుతూ.. బీపాజిటివ్‌ మ్యాగజైన్‌ కవర్‌పై వేసిన చరణ్ పిక్‌ హైలెట్‌ అవుతోంది. అంతేకాదు… నా దేహం - నా దేవాలయం అంటూ రామ్‌ చరణ్‌ కొటేషన్‌ కూడా వైరల్‌ అవుతోంది. ఇక తాజాగా వినయ విధేయరామ టీం రామ్ చరణ్ టాటూ వేయించుకున్న ఓ స్పెషల్ పిక్ ని వదిలింది. షర్ట్ బటన్స్ విప్పేసి టాటూ తో పాటుగా తన దేహాన్ని చూపిస్తూ చాలా స్టైలిష్ గా పక్కకి నించుకుని చేతిలో కళ్లజోడుతో ఉన్న రామ్ చరణ్ వినయ విధేయ రామ పోస్టర్ అదరిపోతుందంటే నమ్మాలి.  జనవరి ఫస్ట్ కి ఫ్యామిలీ, ప్రియురాలితో సందడి చేసిన చరణ్ ఇప్పుడు సోలో లుక్స్ తో ఆకర్షిస్తున్నాడు.

మరి రంగస్థలంలో చిట్టిబాబుగా కండలు తిరిగిన బాడీ తో అదరగొట్టిన రామ్ చరణ్ ఇప్పుడు ఇలా మాస్ లుక్స్ తో ఇరగదీస్తున్నాడు. వినయ విధేయ రామ లో రామ్ చరణ్ బాడీ ఫిట్నెస్, టాటూస్ స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతున్నాయి. అందుకే వినయ విధేయ రామ టీం కూడా రామ్ చరణ్ లుక్స్ ని రకరకాల యాంగిల్స్ లో వదులుతూ మెగా ఫాన్స్ ని తెగ ఖుషి చేస్తుంది.

Vinaya Vidheya Rama Poster: Ram Charan Flaunts Abs:

Pic Talk: Charan Flaunts Abs, Tattoos
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs