కమల్‌హాసన్, శంకర్‌ల కలయికలో వచ్చిన చిత్రం `భారతీయుడు`. తమిళంలో `ఇండియన్` పేరుతో సంచలనం సృష్టించిన ఈ సినిమాకు త్వరలో సీక్వెల్‌రాబోతోంది. ఈ సినిమా తరువాత కమల్ నటనకు గుడ్‌బై చెప్పబోతున్న విషయం తెలిసిందే. సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో శంకర్ రూపొందించనున్న ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంత వరకు ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ని శంకర్ అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా వుంటుందా? వుండదా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
అయితే వాటికి చెక్ పెడుతూ `భారతీయుడు-2` ఈ నెల 18 నుంచి ప్రారంభం కాబోతోంది. అత్యంత భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ తొలిసారి కమల్ సరసన నటించనున్న ఈ చిత్రంలో నయనతార కూడా కీలక పాత్రలో కనిపించనుందని తెలిసింది. డిసెంబర్‌లోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాల్సి వున్నా `2.ఓ` కారణంగా చిత్ర బృందం వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో కమల్ సరసన నటిస్తున్నానంటూ కాజల్ అగర్వాల్ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఇక మిగతా పాత్రల గురించి దర్శకుడు శంకర్ త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాడట.
22 ఏళ్ల క్రితం వచ్చిన `భారతీయుడు` సమయంలో దేశ పరిస్థితులు ఎలా వున్నాయో అంతకు మించి దారుణంగా తయారయ్యాయి. రాజకీయం అయితే మరీ దిగజారిపోయింది. దీన్నే ప్రధానాంశంగా తీసుకుని శంకర్ సీక్వెల్‌ను ప్లాన్ చేసినట్లు తమిళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే భారతీయుడు లుక్ కోసం అమెరికా నుంచి శంకర్ ప్రత్యేకంగా మేకప్ టీమ్‌ను తెప్పించారని, గత కొన్ని రోజులుగా కమల్ మేకప్ టెస్ట్‌లో పాల్గొన్నారని తెలిసింది. ఫైనల్ లుక్ ఓకే కావడంతో ఈ నెల 18 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు శంకర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.