హ్యాపీగా ప్రేమించిన సమంతను పెళ్లాకి సుఖంగా ఉన్న చైతన్యకి ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎందుకు అనుకుంటున్నారా. ఇది నిజజీవితంలో కాదు లెండి రీల్ లైఫ్ లో. గతేడాది బాలీవుడ్ లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకున్న బరేలీ కి బర్ఫీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు కోన వెంకట్ పూనుకున్న విషయం తెలిసిందే. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా హిందీ వెర్షన్ లో ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు హీరోలుగా నటించగా.. తెలుగు వెర్షన్ లో ఆయుష్మాన్ పోషించిన పాత్రకు నాగచైతన్యను అనుకొంటున్నారు. హిందీ వెర్షన్ చూసి చాలా ఇంప్రెస్ అయిన చైతూ వెంటనే ఒప్పుకున్నాడట.
దాంతో కోన ఇప్పుడు సెకండ్ హీరో కోసం వెతుకులాటలో పడ్డాడట. సెకండ్ లీడ్ రోల్ కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. దాంతో ఆ పాత్రకు మాత్రం ఎవరైనా పర్ఫెక్ట్ యాక్టర్ ని సెలక్ట్ చేయాలని కోరుకొంటున్నాడు కోన. హీరోయిన్ గా ఆల్రెడీ నివేతా థామస్, షాలిని పాండేలా పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక 2018లో రెండు ఫ్లాపులతో ఢీలాపడిన నాగచైతన్య.. 2019లో మాత్రం సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకొంటున్నాడు. తన సతీమణి సమంతతో కలిసి మజిలీలో నటిస్తున్న చైతూ.. అనంతరం తన మావయ్య వెంకటేష్ తో కలిసి వెంకీ మామలో కామెడీ పండించనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఈ బాలీవుడ్ రీమేక్ ఉండబోతోంది.