Advertisement
Google Ads BL

రామ్ చరణ్‌ని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు!


రంగస్థలం సినిమాతో భారీ విజయం అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు బోయపాటితో కలిసి ‘వినయ విధేయ రామ’ అంటూ మాస్ మసాలా సినిమా చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై మొన్నటి వరకు అంటే... ‘వినయ విధేయ రామ’ సినిమా ట్రైలర్ విడుదలయ్యేవరకు ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ మంచి అంటే భారీ అంచనాలుండేవి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వినయ విధేయరామ ట్రైలర్ ని బోయపాటి పక్కా మాస్ మాసాలతోనే కట్ చేసాడు. రామ్ చరణ్‌ని మరీ మాస్ యాంగిల్ లోనే చూపెట్టాడు. అయితే ట్రైలర్ కి యూట్యూబ్ నుండి మంచి వ్యూస్ వచ్చాయి కానీ.. విమర్శకులు మాత్రం వినయ విధేయ రామ ట్రైలర్ మరీ ఊర మాస్ గా వుంది.. బోయపాటి లో ఏ మార్పు లేదన్నారు.

Advertisement
CJ Advs

అయితే వినయ విధేయ రామ ట్రైలర్ చూసిన మెగా ఫ్యాన్స్ మొదట్లో ఖుష్ అయినా... సంక్రాంతికి విడుదలవుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, పేట, ఎఫ్2 ట్రైలర్స్ చూశాక కాస్త కంగారు పడుతున్నారు. వినయ విధేయ రామ ట్రైలర్ మొత్తం మాస్‌తోనే నిండిపోయింది. కానీ కథానాయకుడు ప్రేక్షకులు మెచ్చేదిగా... ఎఫ్2 కామెడీ‌తో కూడిన కామెడీ ఎంటెర్టైనెర్‌గా, పేట రజిని మ్యానియాతో నిండిపోయింది. కానీ రామ్ చరణ్ లోని మాస్ యాంగిల్‌ని మరీ ఎక్కువగా బోయపాటి చూపించేశాడేమో... అసలు చరణ్ మాసివ్ స్టయిల్ కన్నా... క్లాస్ లుక్ లోనే చూపిస్తే బావుండేది.. ఇప్పుడు ఈ మాస్ ట్రైలర్ తో సినిమా మీదున్న అంచనాలు ఎక్కడ తగ్గుతాయో అనే కంగారులో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

మరి సినిమా విడుదలకు ఇంకా పది రోజులు టైం ఉంది కనక ఏదన్నా క్లాస్ యాంగిల్ లో ఒక ట్రైలర్ లాంటి టీజర్ వదిలితే బావుంటుందని.... అందుకే రామ్ చరణ్‌కి మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారట. వినయ విధేయ రామ టైటిల్‌కి, కట్ చేసిన ట్రైలర్‌కి సంబంధమే లేదు.. అంటూ మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారట. మరి మెగా ఫ్యాన్స్ కోరిక మేరకు బోయపాటి ఫస్ట్ లుక్ మాస్ యాంగిల్, సెకండ్ లుక్ క్లాస్ యాంగిల్ ని చూపించినట్టుగా... ఫస్ట్ ట్రైలర్ మాసివ్ గాను, సెకండ్ ట్రైలర్ ని క్లాసీగా ఎమన్నా వదిలే ప్లాన్ చేస్తాడేమో చూడాలి. 

Mega Fans Request To Ram Charan:

Mega Fans Wants VVR Class Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs