Advertisement
Google Ads BL

అఫీషియల్: అల్లుఅర్జున్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్


స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’,  మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ల చిత్రం జనవరి, 2019లో ప్రారంభం

Advertisement
CJ Advs

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’,  మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్‌లో మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది. హీరోగా అల్లు అర్జున్‌కు ఇది 19వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్‌లో మూడవ చిత్రం. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల నేపథ్యంలో  ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాలలోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్’ అధినేతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు),అల్లు అరవింద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే చిత్రం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మరో ప్రకటనలో అధికారికంగా తెలియజేయనున్నారు. 2019 జనవరిలో చిత్రం ప్రారంభమవుతుందని, అందరికీ 2019 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు).

Official: Allu Arjun Next Film Confirmed:

Stylish Star Allu Arjun and wordsmith Trivikram Srinivas are coming together for the 3rd time after Julayi and son of Satyamurthy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs