Advertisement
Google Ads BL

నాగార్జున సినిమా ఆగిపోయిందంట..!


తెలుగులో అక్కినేని నాగార్జున ‘ఆఫీసర్’ సినిమా తర్వాత ఇంతవరకు ఒక్క సినిమాని కూడా అనౌన్స్ చేయలేదు. కానీ ఇతర భాషల్లో సినిమాలని ఓకే చేస్తున్నాడు. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ అనే చిత్రంలో నటిస్తున్నాడు నాగ్. ఆల్రెడీ ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తి అయిపోయిందని సమాచారం. అలానే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వస్తున్న ‘మరాక్కార్’ సినిమాలో నాగ్ ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించాడు.

Advertisement
CJ Advs

వీటితో పాటు తమిళంలో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నటుడు ధనుష్ డైరెక్షన్‌లో ‘రుద్ర’ అనే మల్టీస్టారర్‌లో చేయడానికి ఓకే చెప్పాడు. నాగ్ తో పాటు ఇందులో ధనుష్. ఎస్.జె. సూర్య.. అదితిరావు హైదరి.. అరవింద్ స్వామి లాంటి ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్‌తో ధనుష్ ఈసినిమాను తెరకెక్కించాలని భావించాడు. దాదాపు 70 కోట్లు బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు కూడా చెప్పాడు ధనుష్. కానీ కోలీవుడ్ మీడియా ప్రకారం ఈసినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.

ధనుష్ ‘మారి-2’ తరువాత ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్తాడని అనుకున్నారు అంతా. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా అయిపోవడంతో త్వరలోనే ఈసినిమా స్టార్ట్ అవ్వబోతుంది అనుకుంటే...ధనుష్ రీసెంట్ గా తన నెక్స్ట్ మూవీ ‘అసురన్’ సినిమా అనౌన్స్ చేశాడు. దీనికి ధనుష్ డైరెక్టర్ కాదు హీరో మాత్రమే. దీంతో ‘రుద్ర’ దాదాపుగా ఆగిపోయినట్లే అంటున్నారు. కారణం ఈసినిమాను నిర్మిస్తున్న థెండ్రాల్ ఫిలిమ్స్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడమే. ఈ సంస్థ 250 కోట్ల బడ్జెట్‌తో ‘సంఘమిత్ర’ చిత్రాన్ని కూడా నిర్మించాలనుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా కూడా ఆగిపోయింది. మరి ఈ ప్రాజెక్ట్ కి వేరే ప్రొడ్యూసర్ దొరికితే సెట్స్ మీద‌కు వెళ్లే అవకాశముంది.. లేకపోతే ‘రుద్ర’ని ఇంతటితో మరిచిపోవడమే.

Nagarjuna’s Multi Starrer Shelved:

Nagarjuna, Dhanush Film Shelved
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs