Advertisement
Google Ads BL

రాజమౌళి ఈ స్టార్స్‌ని ఇన్వైట్ చేయలేదా?


ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయకి...నటుడు జగపతి బాబు అన్న కూతురు పూజాకి ఈ రోజు (డిసెంబర్30) పెళ్లి జరగనుంది. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జైపూర్‌లోని ఓ హోటల్ లో జరగనుంది. టాలీవుడ్ నుండి చాలా మంది స్టార్స్ ఇప్పటికే అక్కడకు చేరుకొని సందడి చేస్తున్నారు. గత గురువారం సాయంత్రం నుంచే బరాత్ వేడుక సహా సంగీత్ కార్యక్రమానికి సంబంధించి హడావుడి మొదలైంది.

Advertisement
CJ Advs

అయితే ఈ సంగీత్ కార్యక్రమంలో ఎన్టీఆర్, ప్రభాస్, అఖిల్, రానా, అనుష్క, నాని, నాగార్జున తదితరులు కనిపించారు కానీ మెయిన్ స్టార్స్ మిస్ అయ్యారు. టాలీవుడ్ నుండి చాలామంది స్టార్స్ మిస్ అయ్యారు. ముఖ్యంగా చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్.. ఇప్పటివరకూ ఈ వేడుకల్లో కనిపించలేదు. అయితే అల్లు అరవింద్ అండ్ చిరంజీవికి ఆహ్వానాలు అందాయట. వీరు ఈరోజు వెళ్లే అవకాశం ఉంది. కానీ మహేష్, అల్లు అర్జున్‌కి ఆహ్వానాలు అందలేదన్న ప్రచారం సాగుతోంది.

మరి ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ ఈ ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. అల్లు అర్జున్ అయితే హైదరాబాద్‌లోనే ఉన్నాడు. కానీ మహేష్ రీసెంట్‌గా తన ఫ్యామిలీతో కలిసి హాలిడే కి వెళ్ళాడు. టాలీవుడ్ నుండి తనకు అత్యంత సన్నిహితుల్ని మాత్రమే సెలక్టివ్ గా రాజమౌళి ఆహ్వానించారట. మహేష్ కు ఆహ్వానం అందినా దుబాయ్ లోనే ఉన్నాడని సమాచారం. రిసెప్షన్ గ్రాండ్ గా ఉంటుందని అప్పుడు రాజమౌళి అందరిని పిలుస్తాడని చెబుతున్నారు. బహుశా అప్పుడు.. ఇప్పుడు మిస్ అయిన వారంతా వచ్చే అవకాశం ఉంది.

Rajamouli not invite Mahesh Babu and Allu Arjun to his son wedding:

Rumours on Rajamouli Son Marriage invitation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs