Advertisement
Google Ads BL

చైతూ, స‌మంతల ‘మజిలీ’ లుక్ చూశారా?


నాగ‌చైత‌న్య‌, స‌మంత, శివ నిర్వాణ మ‌జిలీ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌.. 

Advertisement
CJ Advs

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి ‘మజిలీ’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి ‘దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనే క్యాప్షన్ పెట్టారు. అంటే ప్రేమ ఉంది.. బాధ ఉంద‌ని అర్థం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంది. నాగచైతన్య, సమంత లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంది. నిన్నుకోరి లాంటి ఎమోష‌న‌ల్ హిట్ సినిమా తెర‌కెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తున్నారు. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహు గ‌ర‌పాటి, హరీష్ పెద్ది  మజిలీ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

 

న‌టీన‌టులు: అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావు ర‌మేష్, సుబ్బ‌రాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు 

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: శివ నిర్వాణ 

నిర్మాత‌లు: సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది 

సంస్థ‌: షైన్ స్క్రీన్స్

సంగీతం: గోపీ సుంద‌ర్ 

సినిమాటోగ్ర‌ఫ‌ర్: విష్ణు వ‌ర్మ‌

ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్ 

ఎడిట‌ర్: ప‌్ర‌వీణ్ పూడి

యాక్ష‌న్: వెంక‌ట్ 

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Majili 1st Look Poster: Naga Chaitanya, Samantha Romantic Pic:

Naga Chaitanya, Samantha and Shiva Nirvan film ‘Majili’ first look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs