Advertisement
Google Ads BL

ఊహించని అతిథి.. మెగాస్టార్ స్వీట్ న్యూస్!


రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్‌కు అనుకోని ఓ అతిధి వచ్చారు. చరణ్ కోసం చిరంజీవి, కేటీఆర్ వచ్చారు. ఇది కామనే. కానీ త్రివిక్రమ్ ఎందుకు వచ్చినట్టు? చివరలో చిరు చెప్పేవరకు త్రివిక్రమ్ ఎందుకు వచ్చాడనే డౌట్.. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారందరిలో ఉండింది. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాలకి తప్ప వేరే సినిమా ఈవెంట్స్‌కి అసలు రాడు. కానీ ఈ ఈవెంట్‌కు వచ్చాడు. పవన్ కళ్యాణ్ సినిమాలకి తప్ప. దాంతో అంతా షాక్‌కి గురైయ్యారు.

Advertisement
CJ Advs

అయితే నిన్న సస్పెన్స్ ని మెగా స్టార్ చిరంజీవి రివీల్ చేశారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నా. డి.వి.వి.దానయ్య  బ్యానర్‌లో అని రివీల్ చేయడంతో అంత షాక్ తిన్నారు. అయితే ఈ కాంబినేషన్ ని రామ్ చరణే సెట్ చేసాడు.. చరణ్ థాంక్స్ ఈ కాంబినేషన్ ని సెట్ చేసినందుకు’’ అని చిరంజీవి అన్నారు. అసలు ఈ కాంబినేషన్ లో సినిమా అని వార్తలు అయితే వచ్చాయి కానీ.. నిజమవుతాయని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. నిజానికి త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో సినిమా చేయాలి కానీ అది ఆగిపోయింది. బన్నీ ఇప్పుడు పరుశురాం తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. సో త్రివిక్రమ్ ఖాళీయే.

కానీ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా-నరసింహారెడ్డి’ చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇది సోషల్ మెసేజ్ ఉండే కమర్షియల్ సినిమా. ఈ రెండు చిత్రాలు తరువాత త్రివిక్రమ్ తో చిరు సినిమా ఉంటుందని అర్థమవుతోంది. అంటే 2020 వరకు చిరు ఖాళీగా లేడు కాబట్టి అప్పటివరకు త్రివిక్రమ్ వెయిట్ చేస్తాడా? లేదా వేరే హీరో‌తో ఈలోపల ఇంకో సినిమా చేస్తాడా? అన్న విషయం తెలియాల్సిఉంది. మెగా ఫ్యాన్స్‌ని ఇంతకుమించి గుడ్ న్యూస్ ఏముంటది.

Surprise Shock to Mega Fans at VVR Pre Release Event:

Chiranjeevi,Trivikram, DVV Combo Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs