Advertisement
Google Ads BL

‘మహర్షి’ టీమ్‌ అలెర్ట్ అయ్యారు కాబట్టే..!


పవన్‌కళ్యాణ్‌ రాజకీయాలకే పరిమితమైన తర్వాత టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఎవరు? అని ప్రశ్నిస్తే ఎవరైనా ఠక్కున ‘మహేష్‌బాబు’ పేరు చెబుతారు. బ్రహ్మోత్సవం, స్పైడర్‌ ఫ్లాప్‌లను మరిచేలా కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ తర్వాత ‘భరత్‌ అనే నేను’గా ముందుకు వచ్చి ఈ ఏడాది పెద్ద హిట్‌ కొట్టాడు. దీని తర్వాత తనతో గతంలో సినిమాలు తీసి నష్టపోయిన పివిపి సంస్థ, వైజయంతీ మూవీస్‌ని దిల్‌రాజుతో కలిపి వంశీపైడిపల్లి డైరెక్షన్‌లో తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా ‘మహర్షి’ చేస్తున్నాడు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ రామోజీ ఫిలింసిటీలో పూర్తయింది. వచ్చే నెల నుంచి చివరి షెడ్యూల్‌ జరగనుంది. ఆ వెంటనే మహేష్‌, పూజాహెగ్డేలపై సాంగ్స్‌ని కూడా ప్లాన్‌ చేసి ముందుగా అనుకున్నట్లు వేసవి కానుకగా మొదటి చిత్రం ఏప్రిల్‌5న విడుదల చేయనున్నారు. 

Advertisement
CJ Advs

ఈ మూవీలోని ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఎమోషన్స్‌, ఫీల్‌ మిస్‌ కాకుండానే ఎంతో సెన్సిబుల్‌గా మహేష్‌ అమెరికా నుంచి ఇండియాకి ఎందుకు వచ్చాడు? ఆ సందర్భంగా జరిగే భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఈ బ్యాంగ్‌ని వంశీ పైడిపల్లి హృద్యంగా తీశాడని సమాచారం. ముగ్గురు భారీ నిర్మాతలు కావడంలో ఖర్చుతో పాటు దేనికి రాజీ పడటంలేదు. అల్లరినరేష్‌ ఇందులో కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఇక మూవీకి సంబంధించిన ఓ సాంగ్‌ బిట్‌ ఆన్‌లైన్‌లో లీకయిందని వార్తలు వస్తున్నాయి. దాంతో వెంటనే యూనిట్‌ నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో పాటు షూటింగ్‌ సమయంలో సెల్‌ఫోన్స్‌, ఎడిట్‌ టేబుల్‌ మీద కూడా కఠిన చర్యలు తీసుకుందని తెలుస్తోంది. 

ఈ మూవీ తర్వాత మహేష్‌ సుకుమార్‌ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే సుకుమార్‌ రెండు స్టోరీలు మహేష్‌బాబుకి వినిపించాడట. కానీ ఈ రెండు తనకి సరిపడా కథలు కావని, ఆ జోనర్‌ చిత్రాలను కాకుండా కొత్త కథను తీసుకుని రమ్మని సుక్కుని మహేష్‌ ఆదేశించాడట. ‘మహర్షి’ షూటింగ్‌ పూర్తయ్యే నాటికి కూడా సుక్కు సరైన కథను అందించలేకపోతే మహేష్‌ మరో దర్శకుడితో ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Mahesh Babu Maharshi Movie Song Leak At Internet :

Mahesh Babu Maharshi Movie Faces Leaks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs