Advertisement
Google Ads BL

కెథరీన్ కొత్త ఇల్లు కష్టాలు..!


అప్పుడెప్పుడో నీలకంఠ దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన చమ్మక్ చల్లో చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన కేతరీన్ అనంతరం ఇద్దరమ్మాయిలతో సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకొని.. అల్లు అర్జున్ తోనే వరుసబెట్టి మూడు సినిమాలు చేసింది. తెలుగులో ఆశించిన స్థాయి విజయాలు దక్కక.. లీడ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోలేకపోయినా, తమిళనాట మాత్రం మంచి ఆఫర్స్ సొంతం చేసుకొని అక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కానీ.. అమ్మడికి మాత్రం టాలీవుడ్ అంటే విపరీతమైన పిచ్చి, పాపం ఆమధ్య రవితేజ హీరోగా ఒక సినిమా సైన్ చేసినా.. కారణాంతరాల వలన ఆ సినిమా ఆగిపోయింది. అప్పట్నుంచి తెలుగులో ఏదో ఒక ఆఫర్ రాకపోదా అని చెన్నైలో వరుస అవకాశాలు వస్తున్నా కూడా హైద్రాబాద్ లోనే తిష్ట వేసుకొని కూర్చుంది. 

Advertisement
CJ Advs

ఇకపోతే.. అమ్మడు హైద్రాబాద్ లోని కోకాపేట్ లో ఓ ఇల్లు కొనుక్కుంది. దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలు పెట్టి కేతరీన్ ఆ ఇల్లు కొనుక్కొని తనకు తానే క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చుకొంది. కొనుక్కోన్నంతవరకు బాగానే ఉంది కానీ.. కొత్త ఇంటి కష్టాలు ఏంటీ అనుకొంటున్నారా. తెలుగులో సరైన అవకాశాలు లేని కేతరీన్ అంత కాస్ట్లీ ఇల్లు కొనుక్కోవడం ఏంటీ అని కొందరు కుళ్లుకోవడం మొదలెట్టారు. దాంతో ఇది ఎవరో బడా హీరో లేదా నిర్మాత గిఫ్ట్ ఇచ్చాడు అని ప్రచారం మొదలెట్టారు. దాంతో తాను కష్టపడి కొనుక్కొన్న ఇంటి గురించి ఇలా మాట్లాడుకోవడం పట్ల చాలా బాధపడింది కేతరీన్. ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లలో తాను సంపాదించిన ఏ ఒక్క రూపాయిని వేస్ట్ చేసుకోకుండా.. కూడబెట్టుకోని డబ్బుతో కొనుక్కున్న ఇంటి క్రెడిట్స్ కూడా తనకు దక్కపోవడంతో బాధపడుతోంది కేతరీన్. అయినా.. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనే సామెత వినలేదేమో అమ్మడు. 

Catherine Tresa New House Problems:

Catherine Tresa Bought a New House in Hyd and her enemies are talking bad about her hard earned money 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs