Advertisement
Google Ads BL

బిల్డప్పులేనా..లేక ఈసారైనా కొడతాడా?


అక్కినేని హీరోలంటే మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్నా కూడా ఎక్కువగా క్లాస్‌ చిత్రాల ద్వారానే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక మాస్‌ ఫాలోయింగ్‌ అనేది ఏయన్నార్‌, నాగచైతన్య వంటి వారికి రాకపోయినా నాగార్జునకి మాత్రం ఉంది. ఇక నాగ్‌ చిన్నకుమారుడు అక్కినేని అఖిల్‌ విషయానికి వస్తే ఏ హీరో అరంగేట్రంకి రాని క్రేజ్‌ ఆయనకు వచ్చింది. మొదటి సినిమా విడుదల కాకముందే పలు ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా చేసే అరుదైన అవకాశం ఆయనకు దక్కింది. ఇక ఈయన మొదటి చిత్రాన్ని నిర్మించాలని నాగార్జున భావించాడు. తమ అన్నపూర్ణ బేనర్‌లోనే తెరంగేట్రం చేయించాలని, నాగచైతన్య విషయంలో దిల్‌రాజుకి ఇచ్చి తప్పు చేశానని, ఆ తప్పు మరోసారి చేయనని చెప్పాడు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం నిర్మించే అవకాశం నితిన్‌కి రాగా, మొదటి చిత్రమే మాస్‌ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌ దర్శకత్వంలో తన సొంత పేరునే సినిమా టైటిల్‌గా ఎంచుకుని బ్యాడ్‌సెంటిమెంట్‌ని రిపీట్‌ చేస్తూ ‘అఖిల్‌’ చేశాడు. దాదాపు 50కోట్ల బడ్జెట్‌, అదే స్థాయిలో బిజినెస్‌ జరగడం చూసి మొదటి చిత్రంతోనే అఖిల్‌ మాస్‌, యాక్షన్‌ హీరోగా స్థిరపడటం ఖాయమని అందరూ భావించారు. 

Advertisement
CJ Advs

కానీ మొదటి చిత్రంతోనే లోక రక్షకుడు వంటి భారీ బాధ్యతను భుజాన వేసుకుని తీవ్రంగా దెబ్బతిన్నాడు. దాంతో నాగార్జున వెంటనే స్పందించి విక్రమ్‌ కె కుమార్‌ వంటి ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌ చేతిలో పెట్టి ‘హలో’ తీశాడు. ఇది కూడా ‘మనస్సంతా నువ్వే’ చిత్రానికి లేటెస్ట్‌ వెర్షన్‌గా విమర్శల పాలు కావడంతో టాక్‌ బాగానే ఉన్నా కమర్షియల్‌గా మరో దెబ్బ తగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్‌ ముచ్చటగా తన మూడో చిత్రాన్ని మొదటి చిత్రం ‘తొలిప్రేమ’తోనే పెద్ద విజయం సాధించి, ప్రశంసలు అందుకున్న వెంకీ అట్లూరికి అప్పగించాడు. దీనికి కూడా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత కావడం విశేషం. ఈ చిత్రం రిపబ్లిక్‌డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక ఇందులో అఖిల్‌ ప్లేబోయ్‌గా కనిపిస్తాడని వార్తలు వస్తూ ఉంటే.. తాజాగా ఈ మూవీలోని మొదటి పాటను ఈ రోజు సాయంత్రం సోషల్‌ మీడియాలో విడుదల చేస్తామని తెలుపుతూ, ఇందులోని ఓ స్టిల్‌ని అఖిల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఇందులో అఖిల్‌ ఆరు పలకల బాడీతో కనిపిస్తున్నాడు. అఖిల్‌ నటించిన రెండు చిత్రాల ద్వారా డ్యాన్స్‌లు, ఫైట్స్‌లో మంచి ఈజ్‌ ఉందని పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇవేమీ చిత్రాన్ని నిలబెట్టలేవని, కావాల్సింది బలమైన కంటెంట్‌ మాత్రమే అని నిరూపితం అయింది. మరి ‘మిస్టర్‌ మజ్ను’తో నాన్న టైటిల్‌తో మెప్పించి, బలమైన కంటెంట్‌తో వస్తాడా? లేదా షరా మామూలే అన్నట్లు ఇతర హంగులపై దృష్టి పెట్టి అసలుది మరిచాడా? అనేది వేచిచూడాల్సివుంది...! 

Akkineni Hero Big Hopes on Venky Atluri:

Akhil Hopes on Mr Majnu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs