Advertisement
Google Ads BL

కావాలంటే రాజమౌళి గారిని అడగండి: ప్రభాస్


ప్రస్తుతం తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ ఎవరు? అనే ప్రశ్నకే ఏకైక సమాధానం వస్తుంది. గతంలో సల్మాన్‌ఖాన్‌ అని, ఇంకా ఎవరెవరి పేర్లో వినిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం అందరు ముక్తకంఠంతో యంగ్‌రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ పేరే చెబుతున్నారు. ప్రభాస్‌ పెళ్లిపై టాలీవుడ్‌ మీడియానే కాదు.. కోలీవుడ్‌, మల్లూవుడ్‌, శాండల్‌వుడ్‌తో సహా బాలీవుడ్‌ అంటే జాతీయ మీడియా కూడా పలు వార్తలను వండి వారుస్తోంది. ఇక రెండు మూడేళ్ల వరకు ప్రభాస్‌, అనుష్కలు కలిసి ‘బాహుబలి’ రెండు భాగాలకు పనిచేయడమే కాదు.. అంతకు ముందు ‘బిల్లా, మిర్చి’ చిత్రాలతో కూడా ఆకట్టుకోవడంతో వీరి మధ్య ఎఫైర్‌ నడుస్తోందనే వార్తలు ఎంత ఆపినా ఆగడం లేదు. చివరకు ఇలాంటి వార్తలు రాస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని అనుష్క హెచ్చరించినా కూడా అందరూ పెడచెవిన పెడుతున్నారు. 

Advertisement
CJ Advs

దీనికి మరోకారణం కూడా ఉంది. ప్రభాస్‌-అనుష్కలు తెర మీద హిట్‌ పెయిర్‌, మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌గా ఉండటంతో పాటు ప్రభాస్‌, అనుష్కని వివాహం చేసుకోవాలని కోరుకునే వారిలో వీరి అభిమానుల శాతమే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక విషయానికి వస్తే బాలీవుడ్‌లో పలు నటీనటుల, సాంకేతిక నిపుణుల వ్యక్తిగత విషయాలను కూడా బయటపెట్టే పరిచయాలు, దమ్ము ఉన్న కరణ్‌జోహార్‌ తాను నిర్వహించే ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమానికి ప్రభాస్‌, రానా, రాజమౌళిలను ముఖ్యఅతిధులుగా పిలిచాడు. ఈ సందర్భంగా ఆయన ప్రభాస్‌ని ఇదే విషయం ప్రస్తావించాడు. అనుష్కతో డేటింగ్‌ చేస్తున్నారన్న వార్తలపై మీ సమాధానం ఏమిటి? అని ప్రభాస్‌ని అడగ్గా, ఆయన సమాధానం ఇస్తూ, ఏ హీరోహీరోయిన్లు అయినా కలిసి రెండేళ్లు పనిచేస్తే వారికి ఎఫైర్‌ ఉందని ప్రచారం చేస్తారు. నిజం చెప్పాలంటే నాకు, అనుష్కకి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మేమిద్దరం డేటింగ్‌ చేస్తున్నామన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కావాలంటే రాజమౌళి గారిని అడగండీ అంటూ రాజమౌళిని పెద్ద మనిషిని చేశాడు. దీనిపై పలువురు పిల్లికి ఎలుక సాక్ష్యమా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

ఇక కరణ్‌జోహార్‌ ఇంకా మాట్లాడుతూ, ‘బాహుబలి’లో అనుష్క మీకు తల్లిగా, భార్యగా నటించింది. ఇది కొంచెం కష్టమే అని కరణ్‌ అనగానే ప్రభాస్‌ అందుకుని, నిజమే.. తల్లిగా నటించిన అనుష్కతో ఎలా డేటింగ్‌ చేస్తాను? ఆమె నాకు మంచి స్నేహితురాలే అని సెంటిమెంట్‌పై కొట్టి ఆయింట్‌మెంట్‌ రాశాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలో అనుష్క గురించి ప్రభాస్‌ మాట్లాడిన మాటలు బాగా వైరల్‌ అవుతున్నాయి. 

Prabhas Talks About Relationship between Anushka :

Prabhas Answer to Koffee with Karan producer 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs