Advertisement
Google Ads BL

అబ్బో.. వినయ విధేయ రామకి అంతా..?


రామ్ చరణ్ - బోయపాటి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం డల్ గా నడుస్తున్నాయి. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై బోలెడంత క్రేజ్ ఉంది. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ వలన వినయ విధేయ రామ క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. డివివి దానయ్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా ఊపందుకుంది. అయితే ఈ సినిమాని యువి క్రియేషన్స్ వారు థియేట్రికల్ రైట్స్‌ని ఓ రేంజ్ లో కొన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ, ఆంధ్రాలలో 72 కోట్లకు మొత్తం థియేట్రికల్ రైట్స్ యువి క్రియేషన్స్ వారు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వినయ విధేయరామ ని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రమోషన్స్ కాస్త వీక్ గా ఉన్న ఈసినిమాకి ఇప్పుడు యువి క్రియేషన్స్ ఓ రేంజ్‌లో పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక యువి వారు వినయ విధేయ రామ థియేట్రికల్ హక్కులు కొన్నతర్వాత.. రిలీజ్ టెంక్షన్స్ లో ఉన్న రామ్ చరణ్, బోయపాటి రిలీఫ్ ఫీలైనట్లు తెలుస్తోంది. అయితే యువి వారు అంతగా ఈ సినిమాకి రేటు పెట్టి కొనడానికి అసలు కారణం... రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని అదే బ్యానర్ లో చేయటానికి ఆసక్తి చూపాడని…అందుకే యువి క్రియేషన్స్ వారు ఆ రేటు పెట్టారని సమాచారం.

మరి వినయ విధేయ రామ థియేట్రికల్ బిజినెస్ ఆ రేంజ్ లో జరిగింది అంటే.. ఇంకా శాటిలైట్, ఓవర్సీస్ బిజినెస్ అన్ని కలిపి ఏ రేంజ్ బిజినెస్ అవుతుందో అంటున్నారు. అయితే  రామ చరణ్ రంగస్థలం హిట్ అవడంతోనే ఇప్పుడు వినయ విధేయ రామకి ఈ రేంజ్ బిజినెస్ జరిగింది అని కూడా అంటున్నారు. మరి ఇక్కడ కేవలం రామ్ చరణ్ క్రేజే పనిచేసినట్లుగా కనబడుతుంది. 

Vinaya Vidheya Rama Movie Theatrical Rights Sold Out:

UV Creations Bagged VVR Theatrical Rights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs