తెలుగులో నటించడానికి ముందే తెలుగు యువకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న సాయిపల్లవి.. ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింతమందికి చేరువైంది. తాను ఎంచుకొన్న పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేయడం, హీరోలతో సమానంగా డ్యాన్స్ చేయడం వంటివి అమ్మడికి ప్లస్ పాయింట్స్ కాగా.. మీడియా ముందు అనవసరమ విషయాలు మాట్లాడి తిప్పలుపడడం మైనస్ పాయింట్. నానితో కలిసి చేసిన ఎం.సి.ఏ సినిమా విడుదలయ్యాక తమిళ మీడియాతో మాట్లాడుతూ.. కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం చేసిన సినిమా అది, ఇకపై అలాంటి సినిమాలు చేయను అని స్టేట్ మెంట్ ఇచ్చి ఆ సినిమా పరువు తీసిపాడేసింది. ఆ తర్వాత నాగశౌర్య విషయంలోనూ పొగరుగా వ్యవహరించి కణం సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ గా నిలిచింది. నేను డైలాగ్స్ ప్రిపేర్ అవుతున్న టైమ్ లో శౌర్య నా దగ్గరకి వచ్చాడు.. ఆ టైమ్ లో నేను రెస్పాండ్ అవ్వలేదని తను నన్ను తప్పుగా అర్ధం చేసుకొన్నాడని స్టేట్ మెంట్స్ ఇచ్చి మళ్ళీ మీడియాలో హైలైట్ అయ్యింది. ఆ విషయమై అప్పటికే కోపంగా ఉన్న శౌర్య.. ఇంకాస్త ఫైర్ అయ్యాడు.
ఇప్పుడు మళ్ళీ పడి పడి లేచే మనసు విషయంలో కూడా.. ఏదైనా పాత్ర నన్ను చాలా భీభత్సంగా ఎగ్జైట్ చేయాలి, అప్పుడే సినిమా సైన్ చేస్తాను. అయినా నా పాత్రకు న్యాయం చేయడం వరకే నా పని.. ఆ సినిమా ఆడుతుందా లేదా అనేది నాకు అనవసరం అని స్టేట్ మెంట్స్ ఇస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో సాయిపల్లవి యాక్టివ్ గా లేదు. తమిళ చిత్రం మారి 2 ప్రమోషన్స్ లో బిజీ అయిపోయిన సాయిపల్లవి.. సినిమా విడుదలయ్యాకే ప్రమోషన్స్ కి టైమ్ ఇచ్చింది. ఇప్పుడు సక్సెస్ టూర్స్ కోసం షెడ్యూల్స్ ఇచ్చినా.. సినిమా టాక్ బయటపడ్డాక ఈ టూర్స్ అనేవి ఎంతవరకూ ఉపయోగపడతాయి అనేది టీం కే తెలియాలి.