అప్పుడప్పుడు డైరెక్టర్స్ ఎంతో ఇష్టంగా తీసుకున్న సీన్స్.. సాంగ్స్.. ఫైట్స్ ఎడిటింగ్ టేబుల్ మీద లెగిసిపోతుంటాయి. అందుకు డైరెక్టర్స్ సైతం బాధపడుతుంటారు. కానీ చేసేది ఏమి ఉండదు. సినిమా నిడివి దృష్టిలో పెట్టుకుని ఎడిటర్స్ ప్రేక్షకులకు ఎక్కడ చిరాకు రాకుండా ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఎంత ఖర్చు పెట్టి తీసినా అవి టేబుల్ మీదకు వచ్చేప్పటికి ఎడిటింగ్‌లో పోతుంటాయి. ఈమధ్య వచ్చిన విజయ్ సినిమా ‘ట్యాక్సీవాలా’ విషయంలో ఇదే జరిగింది. సాధారణంగా ఈ సినిమా నిడివి ముందు మూడున్నర గంటల పైనేనట. కానీ చివరికి అంతా కాంప్రమైజ్ అయ్యి నిడివి రెండుంబావు గంటలకు కుదించారు. అలా తగ్గించిన సినిమా హిట్‌గా నిలిచింది.
అలానే రెండు రోజులు కిందట వచ్చిన శర్వా ‘పడి పడి లేచె మనసు’ విషయంలో కూడా ఇదే జరిగింది. దాదాపు కోటి రూపాయలు పెట్టి.. వంద మంది డ్యాన్సర్స్‌తో చాలా గ్రాండియర్‌గా రాజస్థాన్‌లో ఓ సాంగ్‌ను తీశారు. చాలా ఇంటర్వూస్‌లో శర్వా.. ఈ విషయం గురించి చెప్పాడు. ప్రమోషన్లలో అంత గొప్పగా చెప్పిన పాట సినిమాలో లేదు. మరి ఈ పాట ఎందుకని తీసేశారో తెలియదు.
ఇలా సినిమాల్లో చాలా ఖర్చు పెట్టి సాంగ్స్ తీసినా.. అవి సినిమాలో లేని సందర్భాలు చాలా ఉన్నాయి. మరి డైరెక్టర్స్ ఎందుకని ఆలోచించకుండా ఇలా చేస్తున్నారో వారికే తెలియాలి. ఇలా చేయడం వల్ల బడ్జెట్లు హద్దులు దాటే అవకాశం ఉంటుంది. ఒక్క సాంగే కాదు సినిమాలో చాలా సీన్స్ అవసరం లేదు అనిపించింది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే బడ్జెట్ పెరిగిపోతుంది అన్నారు. చివరికి కోటి రూపాయలు పెట్టి తీసిన సాంగ్ సినిమాలో లేకుండా పోయింది.