లేడీ సూపర్‌స్టార్ నయనతార మలయాళంలో నటించగా మంచి విజయం సాధించిన ‘ఎలెక్ట్రా’ చిత్రాన్ని తెలుగులో ‘లేడీ టైగర్’ పేరుతో ప్రేక్షకులకు అందిస్తున్నారు. సురేష్ సినిమా పతాకంపై సి.ఆర్.రాజన్ సమర్పణలో సురేష్ దూడల ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీమతి సరోజ సురేష్ ఈ చిత్రానికి సహ నిర్మాత. ప్రకాష్ రాజ్, మనీషా కొయిరాలా, బిజూ మీనన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యాంప్రసాద్ దర్శకుడు.
ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని సురేష్ సినిమా అధినేత సురేష్ దూడల మాట్లాడుతూ... ‘‘లేడీ సూపర్ స్టార్ నయనతార ఫ్యాన్స్‌కి పండగలాంటి సినిమా ‘లేడీ టైగర్’. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే మనీషా కొయిరాలా నటన కూడా. ఈనెల 29న విడుదలవుతున్న ఈ చిత్రం కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం..’’ అని అన్నారు.