Advertisement
Google Ads BL

అప్పుడు కూతురు.. ఇప్పుడు తల్లిగా మారింది


కొత్తబంగారు లోకంతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న రావు రమేష్.. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ కి, ఫాదర్ రోల్స్ కి కేరాఫ్ అడ్రెస్ అయ్యాడు. ఒకరకంగా ప్రకాష్ రాజ్ కు తెలుగులో సినిమాలు తగ్గడానికి రావు రమేష్ కారకుడు. ప్రకాష్ రాజ్ కి రీప్లేస్ మెంట్ లా తయారయ్యాడు రావు రమేష్. అప్పుడప్పుడూ విలన్ గానూ మెరుస్తూ ఉండే రావు రమేష్ త్వరలోనే ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు.. అది కూడా సమంతకి కొడుకుగా. 50 ఏళ్ల రావు రమేష్ ఏంటీ.. 31 ఏళ్ల సమంతకి కొడుకు ఏంటీ అనుకుంటున్నారా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. 

Advertisement
CJ Advs

సమంత టైటిల్ పాత్రలో నందినీ రెడ్డి ఓ బేబీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఓ కొరియన్ డ్రామాకి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత 70 ఏళ్ళ భామగా కనిపించనుంది. ఆమె కొడుకుగా రావు రమేష్ కనిపిస్తాడు. నాగశౌర్య ఓ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆల్రెడీ ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లనుంది. 

విచిత్రం ఏమిటంటే.. సమంత మునుపటి చిత్రమైన రాజుగారి గది 2లో రావు రమేష్ ఆమెకు తండ్రిగా నటించాడు. ఇప్పుడు ఓ బేబీలో కొడుకుగా కనిపించనుండడం గమనార్హం. అయినా ఇంత విభిన్నమైన పాత్ర పోషించే అవకాశం ఎవరికి వస్తుంది చెప్పండి. 

Samantha Becomes Mother for Rao Ramesh:

After Playing the Daughter role for Rao Ramesh in RGG2, Now Sam Plays his Mother in Oh Baby
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs