Advertisement
Google Ads BL

శర్వానంద్, వరుణ్ తేజ్.. విన్నరెవరు?


శుక్రవారం ఇద్దరు యంగ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. అందులో ఒకరు శర్వానంద్, మరొకరు మెగా హీరో వరుణ్ తేజ్. ఇద్దరు డిఫ్రెంట్ జోనర్స్‌తో ప్రేక్షకులముందుకి వచ్చారు. శర్వానంద్ ప్రేమకథతో వస్తే.. వరుణ్ తేజ్ స్పేస్ కథతో వచ్చాడు. హను రాఘవ పూడి దర్శకత్వంలో శర్వానంద్ - సాయి పల్లవి జంటగా పడి పడి లేచె మనసు సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా క్రిటిక్స్ నుండి ప్రేక్షకుల నుండి కూడా యావరేజ్ మార్కులే వేయించుకుంది. సినిమాలో రొమాంటిక్ అండ్ లవ్ సీన్స్ అండ్ పాటలు మరియు సినిమాటోగ్రఫీ అన్ని చక్కగా కుదిరినా... ఫస్ట్ హాఫ్‌లో ఉన్న జోరు సెకండాఫ్‌లో మిస్ అవడంతో సినిమా సక్సెస్ అవ్వలేదు. దర్శకుడు హను రాఘవపూడి పడి పడి లేచె మనసు ఫస్టాఫ్‌లో అల్లిన ప్రేమ కథకు.. సెకండాఫ్‌లో పట్టు తప్పడం, అసలు కథకి కథనానికి మధ్యన పొంతన లేకపోవడంతో సినిమా ఫలితం తారుమారయ్యింది. సెకండాఫ్ స్లో నేరేషన్ బాగా దెబ్బేసింది. శర్వానంద్, సాయి పల్లవిల నటన ఎంతగా హైలెట్ అయినా... సెకండాఫ్‌లో వెయిట్ లేకపోడంతో సినిమాకి యావరేజ్ మార్కులే పడ్డాయి. అందుకే రివ్యూ రైటర్స్ అంతా.. పడి పడి లేచె మనసుకి 5 కి 2.5 రేటింగ్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

ఇక మరో యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం సినిమాకు యావరేజ్, హిట్ మధ్యన ఉన్న మార్కులే పడ్డాయి. అంటే శర్వానంద్ మీద ఒక .25 ఎక్కువన్నమాట. అంటే పడి పడి లేచే మనసుకి 2.5 వస్తే.. వరుణ్ అంతరిక్షానికి 2.75 వేశారు రివ్యూ రైటర్స్. వరుణ్ తేజ్ నటన, అదితి రావు నటన సినిమాకి హైలెట్ అనేలా ఉన్నాయన్నారు ప్రేక్షకులు. అయితే దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఘాజీ లాంటి కథతో అంతరిక్షాన్నితెరకెక్కించలేకపోయాడు. కథలో కొత్తదనం చూపించినా... ఎంటర్టైన్మెంట్ లేకపోవడం సినిమాకి మైనస్. విజువల్ ఎఫెక్ట్స్ కాస్త వీక్ గా అనిపించినా ఆ సినిమాకి అవే హైలెట్ అనేలా ఉన్నాయి. ఇంకా సినిమాలో బలమైన ఎమోషన్స్ మిస్ అవడం, అలాగే సినిమా కేవలం మల్టిప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రమే అన్నట్టుగా నిర్మించడం, బిసి సెంటర్స్ ని ఈ సినిమా అర్ధమవకపోవడం అనేది మైనస్. ఇక సినిమాకి ప్రశాంత్ విహారి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోశాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఘాజీ అంతకాదుగాని... అంతరిక్షం కూడా బాగానే ఆకట్టుకుంటుంది. మరి ఈ వారం పోటీకి దిగిన ఇద్దరు హీరోల పరిస్థితి ఇది. ఒకరు హిట్టు కాదు.. ఒకరు ఫట్టు కాదన్నట్టుగా ఉన్నాయి వారు నటించిన సినిమాలు.

Sharwanand and Varun Tej.. Who is the winner?:

Padi padi leche manasu vs Antariksham
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs