Advertisement
Google Ads BL

ఈ పిక్‌తో NTR ఫ్యాన్స్ పండగ చేసుకున్నారంతే!


శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక నందమూరి ఫ్యామిలీ అండ్ అభిమానుల మధ్యన అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అతిరథ మహారథులు పాల్గొన్న ఈ వేడుక ఆద్యంతం నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. కేవలం అభిమానులే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకను చూడడానికి బుల్లితెరకు అతుక్కుపోయారు. మోహన్‌బాబు, క్రిష్, కృష్ణంరాజు వంటి సీనియర్ నటులు, ఎన్టీఆర్ కూతుళ్లు, కొడుకులు, మనవలు, రానా, సుమంత్, రకుల్, ప్రణీత, విద్యాబాలన్ అందరూ పాల్గొన్న ఈ వేడుకలో మెయిన్ హైలెట్ బాలకృష్ణ ఎన్టీఆర్ గెటప్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకి రావడం. జూనియర్ ఎన్టీఆర్ అసలీ వేడుకకి వస్తాడా లేదా అనుకుంటున్న టైములో ఎన్టీఆర్, ఎన్టీఆర్ బయోపిక్ ఆడియోకి వస్తున్నాడని చెప్పగానే నందమూరి అభిమానులు ఆనందం మాటల్లో చెప్పనలవి కాదు.

Advertisement
CJ Advs

ఇక బాలకృష్ణ స్టేజ్ మీద అందరినీ రిసీవ్ చేసుకున్న తీరు, ఆయన ఎనర్జీ ఎన్టీఆర్ అభిమానులంతా అంటే పరుచూరి, మోహన్ బాబు, కళ్యాణ్ రామ్, కృష్ణ, అలనాటి తారలంతా నందమూరి నటసింహం ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తాతగారి గురించి, ఎన్టీఆర్ బయోపిక్ గురించి, దానికి పనిచేసిన టెక్నీకల్ టీం ని, దర్శకుడు క్రిష్ గురించి మాట్లాడాడు. అనంతరం బాలకృష్ణతో ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ లు ఫోటో దిగుతున్నపుడు.. ఫోటో గ్రాఫర్స్ కళ్యాణ్ రామ్‌ని, బాలయ్యని, ఎన్టీఆర్‌ని ఫోటో తీసేలోపు స్టేజ్ మీదున్న బాలయ్య ఎన్టీఆర్‌తో ఆత్మీయంగా మాట్లాడడం, కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్య తలమీదున్న గులాబీ రేఖను తియ్యగా... దానికి సరదాగా బాలయ్య, కళ్యాణ్ రామ్ ని మోచేతితో అలా తొయ్యడం చూసిన ప్రతి ఒక్కరు అంటే నందమూరి అభిమానులు అక్కడి అరుదైన దృశ్యం చూసి మైమరచిపోయి కేరింతలు కొట్టారు. ఎన్టీఆర్, బాలయ్య, కళ్యాణ్ రామ్ ఒకే ఫ్రేమ్‌లో ఫోటో గ్రాఫర్స్‌ కోసం ఫోజిచ్చారు. మరి మీరు ఆ ఫోటోని చూసి ఎంజాయ్ చేయండి. 

Viral Pic at NTR Biopic Audio Launch:

NTR Fans Happy with NTR Biopic Function
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs