Advertisement
Google Ads BL

రీలే కాదు అఖిల్ రియల్ హీరో అంటోంది


అక్కినేని అఖిల్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో సైతం హీరోయిన్ ని కాపాడాడు. అఖిల్ ప్రస్తుతం ‘తొలి ప్రేమ’తో సత్తా చాటిన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ పెద్ద ప్రమాదం నుండి హీరోయిన్ నిధి అగర్వాల్ ని కాపాడాడంట. ఈ విషయాన్నీ హీరోయిన్ స్వయంగా పంచుకుంది. లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పింది నిధి.

Advertisement
CJ Advs

‘మిస్టర్ మజ్ను’ షూటింగ్ లో భాగంగా పైన వేలాడదీసిన ఒక పెద్ద లైట్ అనుకోకుండా కిందకి పడింది. అది కిందకి పడుతున్న టైములో ఆ లైట్ కింద హీరోయిన్ నిధి అగర్వాల్ ఉండడం చూసి అఖిల్ వెంటనే  క్షణకాలంలో దాన్ని పక్కకు నెట్టేశాడట. ఆ సమయంలో అఖిల్ అక్కడ లేకపోతే ఆ లైట్ డైరెక్ట్ గా వచ్చి తన మొహం మీద పడేదని.. స్వల్ప వ్యవధిలో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నానని ఈ సంఘటన తన లైఫ్ లో ఎన్నడూ మర్చిపోలేనని అఖిల్ పై ప్రశంసలు కురిపించింది నిధి.

నిధి ఒకేసారి అక్కినేని బ్రదర్స్ తో చేసే ఛాన్స్ కొట్టేసింది. ‘సవ్యసాచి’ తో నాగ చైతన్య.. అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ చేసే ఛాన్స్ కొట్టేసింది. ‘సవ్యసాచి’ రీసెంట్ గా రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచిన సంగీతం తెలిసిందే. దాంతో ఆమె ‘మిస్టర్ మజ్ను’ మీదే ఆశలు పెట్టుకుంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి లో రిలీజ్ కానుంది.

Akhil saves Heroine from Accident:

Akhil saves Me, says Heroine
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs