Advertisement
Google Ads BL

సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉన్నట్లే!


‘సర్కార్, నవాబ్’ వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన అభిరుచిగల నిర్మాత వల్లభనేని అశోక్.. హ్యాట్రిక్ దిశగా సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘పెట్టా’ చిత్రాన్ని ‘పేట’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ.. ‘‘సూపర్‌స్టార్ రజినీకాంత్ రోరింగ్ పెర్ఫార్మెన్స్ హైలె‌ట్‌గా తెరకెక్కిన ‘పేట’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.. రజినీకాంత్‌కు వీరాభిమాని. అందుకే రజినీకాంత్‌ను ఆయన చూపించిన విధానం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రజినీకాంత్ పాత్రతో పాటు ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అటు మాస్ ఆడియన్స్‌ను, ఇటు క్లాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసే కమర్షియల్ అంశాలున్న మంచి చిత్రమిది. ఈ చిత్రాన్ని సంక్రాంతి‌కి రిలీజ్ చేయనున్నాం‌‌‌‌’’ అన్నారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ, త్రిష, సిమ్రాన్, విజయ్ సేతుపతి, బాబీ సింహ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కార్తీక్ సుబ్భారాజ్, నిర్మాత: వల్లభనేని అశోక్.

Petta in Sankranthi Race:

Producer Ashok is the Telugu Petta Producer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs