‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన లావణ్యం అదేనండి లావణ్య త్రిపాఠి... పెద్ద స్టార్స్‌తో సినిమాలు చెయ్యకపోయినా.. కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ తారగానే ఉంది. లావణ్య త్రిపాఠి అంటే ట్రెడిషన్‌కి పెట్టింది పేరు. అయితే సినిమాల్లో కుందనపు బొమ్మగా కనిపించే లావణ్య.. బయట మాత్రం గ్లామర్ భామగానే ఉండడానికి ఇష్టపడుతుంది. అయితే ట్రెడిషన్ పాత్రలు చేస్తుంటే హిట్ పడడం లేదని.. ఒకటిరెండు సినిమాల్లో గ్లామర్‌గా రెచ్చిపోయినా అమ్మడుకి లక్కు కలిసి రాలేదు. మిస్టర్, ఉన్నది ఒకటే జిందగీ ఇలా ఒకదాని తర్వాత మరొకటి ప్లాపులే లావణ్య ని చుట్టుముట్టాయి కానీ... అమ్మడుకి మాత్రం సరైన హిట్ తగల్లేదు.
ఇక తాజాగా లావణ్య నటించిన రెండు సినిమాల్లో ఒక సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరొక సినిమా ముద్ర ఎపుడు విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇక తాజాగా వరుణ్ తేజ్‌ని మరోసారి నమ్ముకుంది లావణ్య త్రిపాఠి. ‘మిస్టర్’తో వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన లావణ్యకి ఆ సినిమా షాకిచ్చింది. మరి ఇప్పుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ‘అంతరిక్షం’ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో కానీ... లావణ్యకి మాత్రం ‘అంతరిక్షం’ లైఫ్ అండ్ డెత్ మూవీనే. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితేనే లావణ్య మళ్లీ అవకాశాలు దక్కించుకుంటుంది. లేదంటే అమ్మడుకి గడ్డుకాలమే.
మరి మంచి అంచనాలతో బరిలోకి దిగుతున్న అంతరిక్షం సినిమా హిట్ అవ్వాలని లావణ్య మొక్కని దేవుడు లేడు. ఇక లావణ్య త్రిపాఠి నటించిన మరో సినిమా ముద్ర. నిఖిల్‌తో జోడి కట్టిన ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఇక ఆ సినిమా గురించి ఆలోచన లేదుకానీ... ప్రస్తుతం లావణ్య ధ్యాసంతా అంతరిక్షం మీదే ఉంది. చూద్దాం అంతరిక్షం లావణ్యాన్ని ఏ తీరానికి చేరుస్తుందో?