Advertisement
Google Ads BL

ప్లేబోయ్‌తో అలాంటిదేం లేదంటోంది..!


బాలీవుడ్‌లోనే కాదు.. దేశంలోని అన్ని భాషల్లో ఉన్న బాగా వయసైపోయినా ఇప్పటికీ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌గా పేరు తెచ్చుకున్న ఇండియన్‌ స్టార్‌, కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌. ఈయన ఇండియాలోనే టాప్‌ ప్లేబోయ్‌గా తనదైన పేరు తెచ్చుకున్నాడు. పెళ్లయిన వాడికి ఒకటే పెళ్లాం.. కానివాడికి ఎన్నో అన్నట్లుగా ఈయనకు ఏ హీరోయిన్‌తో నటిస్తే ఆల్‌రెడీ ఆ హీరోయిన్‌తో ఎఫైర్స్‌ కబుర్లు రెడీ అయిపోతాయి. ఇందులో వాస్తవం లేదని కూడా చెప్పలేం. ఎందుకంటే ఈయన ఎఫైర్లపై వచ్చే వార్తలు దాదాపు నిజమేనని అందరు నమ్ముతారు. భాగ్యశ్రీ నుంచి కాజోల్‌, శిల్పాశెట్టి, ఐశ్వర్యారాయ్‌.. వీరితో పాటు యంగ్‌ హీరోయిన్లు అయిన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ వరకు ఎందరో ఈ లిస్ట్‌లో ఉన్నారు. 

Advertisement
CJ Advs

ఇక 1990లలో సల్మాన్‌ఖాన్‌కి, పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టికి మధ్య ఎఫైర్‌ సాగుతుందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అవి జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించి, పతాక శీర్షికలకు ఎక్కాయి. ఇక పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి ‘బాజీఘర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌తో తెరంగేట్రం చేయడమే కాదు.. ఆ తర్వాత తెలుగులో రాఘవేంద్రరావు, వెంకటేష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘సాహస వీరుడు-సాగరకన్య’, మోహన్‌బాబు-ఈవీవీ సత్యనారాయణల ‘వీడెవడండీ బాబు’, నాగార్జున-తిరుపతి స్వామిల ‘ఆజాద్‌’, బాలకృష్ణ-అరుణ్‌ప్రసాద్‌ల ‘భలే వాడివి బాసూ’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆ తర్వాత ఈమె ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్‌కుంద్రాని వివాహం చేసుకుని ఐపీఎల్‌ బిజినెస్‌లోకి కూడా ఎంటర్‌ అయింది. ఈమె ఇంటికి 1990ల కాలంలో తరుచుగా రాత్రిళ్లు కూడా సల్మాన్‌ఖాన్‌ వచ్చేవాడని, దాంతో ఇద్దరి మద్య ఎఫైర్‌ ఉందని కథనాలు వచ్చాయి. 

కానీ ఈ విషయంపై ఇప్పటివరకు వీరిద్దరు నోరు మెదపలేదు. తాజాగా దీనిపై శిల్పాశెట్టి స్పందించింది. ఆమె మాట్లాడుతూ, సల్మాన్‌కి మాతండ్రితో ఎంతో అనుబంధం ఉంది. ఇద్దరు కలిసి మందు తాగేంత చనువు కూడా ఇద్దరి మద్య ఉంది. ఈ కారణం చేతనే తరచుగా సల్మాన్‌ మా ఇంటికి వచ్చేవాడు. నాన్న మరణించిన తర్వాత సల్మాన్‌ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా నేరుగా బార్‌ వద్దకు వెళ్లేవాడు. టేబుల్‌పై తలపెట్టి బాగా ఏడ్చేవాడు. అంతేగానీ సల్మాన్‌కి నాకు ఎలాంటి ఎఫైర్‌ లేదని క్లారిటీ ఇచ్చింది. మరి ఇందులో నిజం ఏమిటో బిటౌన్‌ మీడియానే తేల్చిచెప్పాలి. 

Heroine Clarity on Affair with Playboy :

Shilpa Shetty about Affair with Salman Khan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs