Advertisement
Google Ads BL

ఈసారి చరణ్ ఆటలు సాగుతాయా?


‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం “వినయ విధేయ రామ”. మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగింది. ‘రంగస్థలం’ మూవీ విడుదల అయిన అన్ని చోట్ల సూపర్ హిట్ అందుకుంది. అలానే ఓవర్సీస్ లో కూడా పెద్ద హిట్ గా నిలిచింది.

Advertisement
CJ Advs

అదే విధంగా “వినయ విధేయ రామ” సినిమా కూడా అన్ని ఏరియాస్ లో రికార్డులను కొల్లగొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ లో ‘రంగస్థలం’ లాగా పెద్ద హిట్ అయితే తప్ప...ఇంకా చెప్పాలంటే ‘రంగస్థలం’ లాంటి కంటెంట్ అయితే తప్ప అక్కడ కొత్త రికార్డులు నమోదు కావనే చెప్పాలి. ఓవర్సీస్ లో కేవలం ప్రీమియర్స్ తోనే 2 మిలియన్ మార్క్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అలా అనుకోవడంలో తప్పు లేదు కానీ ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ అంటే కష్టమే అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. అక్కడ ఈ సినిమాను సెయిలింగ్ స్టోన్స్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేస్తున్నారు. ‘రంగస్థలం’ కి రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు.. మరి ఈ సినిమాకి కూడా ఉంటారా? ఉంటే ఆ మార్క్ ను అందుకోడం పెద్ద విషయం కాదు. మరి ఏమి అవుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుంది.

What About Vinaya Vidheya Rama Overseas Business:

Will Ram Charan Continues Rangasthalam Magic with VVR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs