Advertisement
Google Ads BL

‘ఎఫ్2’... అనిల్ రావిపూడి దొరికేశాడు


ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా హిట్ కొట్టేది మేమే అంటున్నారు ‘ఎఫ్2’ యూనిట్. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ బాగా ఆడతాయని ఈ సీజన్ కు ఇదే బెస్ట్ ఛాయస్ అని చెబుతున్నారు. వెంకటేష్ - వరుణ్ లు మధ్య వచ్చే కామెడీ సీన్స్ సినిమాను మరోస్థాయికి తీసుకుని వెళ్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ‘ఎఫ్2’ ఒక పాత తెలుగు సినిమా లైన్ నుంచి స్ఫూర్తి పొందిందనేది సమాచారం.

Advertisement
CJ Advs

1991లో పిఎన్ రామచంద్రరావు దర్శకత్వం వహించిన ‘ఇంట్లో పిల్లి వీధిలో పులి’ అనే సినిమా నుండి లైన్ తీసుకుని ఈసినిమాను చెక్కినట్టు వినికిడి. ఇందులో మిడిల్ ఏజ్ పాత్రలో చంద్రమోహన్, యువకుడిగా సురేష్ నటించి మంచి కామెడీని పంచుతారు. వీరు బయట విర్రవీగుతూ ఇంట్లో పెళ్ళాం చెప్పినట్టు వింటూ నానా అగచాట్లు పడుతుంటారు. అప్పటిలో ఇది డీసెంట్ హిట్. మంచి కామెడీ ఉండడంతో జనాలు దీన్ని యాక్సప్ట్ చేశారు.

కరెక్ట్ గా అదే పాయింట్ తో అనిల్ రావిపూడి ‘ఎఫ్2’ ను తీశాడని తెలుస్తుంది. ఇందులో కూడా వెంకీ - వరుణ్ లు ఇంట్లో పెళ్ళాల నస తట్టుకోలేక ఏమి చేశారనేదే ‘ఎఫ్2’ కథ. తమన్నా, మెహ్రీన్ గ్లామర్లను వాడుకునేలా అనిల్ రావిపూడి చాలా మార్పులు చేశాడట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వరకు ఆగాల్సిందే. అనిల్ రావిపూడి కామెడీ డీల్ చేయడంలో ఎక్స్పర్ట్. ఖచ్చితంగా ఈసినిమా సంక్రాంతి రేస్ లో విన్ అవుతుందని ఆశిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈసినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Copy Rumours on F2 Movie:

F2 Movie Copy to Intlo Pilli Veedhilo Puli
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs