Advertisement
Google Ads BL

బాల్.. సమంత నుంచి త్రిష వైపు..!


తమిళంలో సక్సెస్ ఫుల్‌గా 75 డేస్ పూర్తి చేసుకున్న బ్లాక్ బస్టర్ చిత్రం 96 ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ కాబోతుంది. 96 సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే... ఆ సినిమా రీమేక్ రైట్స్ ని చేజిక్కించుకుని.. ఆ సినిమా కోసం.. డైరెక్టర్, మంచి హీరో, హీరోయిన్ కోసం నిర్మాత దిల్ రాజు ఎదురు చూస్తున్నాడు. అయితే మొదట్లో నాని హీరోగా ఈ సినిమా చేద్దామనుకుంటే.... అబ్బే నేను హీరో అయితే బాగోదు.. అన్నాడట నాని. ఇక అల్లు అర్జున్ అయితే.. విజయ్ సేతుపతి కేరెక్టర్ కి నేను సెట్ అవని చెప్పాడట. ఇక తిరిగి దిల్ రాజు చాలా కాలం వేచి చూశాక.. శర్వానంద్ కి 96 సినిమా చూపించగా.. తాను విజయ్ సేతుపతి కేరెక్టర్ చెయ్యడానికి ఒప్పుకున్నాడని టాక్ నడుస్తుంది.. ఇక శర్వా కూడా పడి పడి లేచె మనసు ఇంటర్వ్యూస్‌లో 96 లో హీరో తానేనంటూ కన్ఫర్మ్ చేసాడు.

Advertisement
CJ Advs

ఇక హీరోగా శర్వాని తీసుకున్న దిల్ రాజు మొదటి నుండి చెప్పినట్టుగా హీరోయిన్ గా సమంత ని తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఇక పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్న సమంత కూడా తమిళ 96 లో త్రిష కేరెక్టర్ చెయ్యడానికి ఓకె చెప్పేసింది అన్నారు. ఇక 96 తెలుగు రీమేక్ లో సమంత.. త్రిష రోల్. శర్వానంద్.. విజయ్ సేతుపతి రోల్ చేస్తున్నట్లుగా మీడియా కన్ఫర్మ్ చేసింది. అయితే తాజాగా హీరో శర్వానంద్ ఓకే గాని....హీరోయిన్ గా సమంత ఇంకా ఫైనల్ అవ్వలేదట. సమంత డెసిషన్ పెండింగ్‌లో ఉన్నట్లుగా సమాచారం.

ఒకవేళ సమంత నో చెబితే.. తమిళ 96 లో చేసిన త్రిష. తెలుగులో శర్వానంద్ పక్కన నటిస్తుందేమో అంటున్నారు. సమంత  కాదంటే.. ఫైనల్ గా త్రిష అనే అంటున్నారు. చూద్దాం దిల్ రాజు 96  కోసం శర్వానంద్ కోసం త్రిషనే ఉంటుందో.. లేదంటే సమంత వస్తుందో అనేది.

Trisha for the leading lady character:

Trisha To Sign Sharwanand For 96 Remake!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs